Jagan Slams Chandrababu: 5 నెలలు దాటినా సూపర్ సిక్స్ లేదు, దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే చంద్రబాబు పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్
చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు.
Vjy, Oct 18: ఏపీలో ఇసుక పాలసీపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ శుక్రవారం మాట్లాడారు. చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయిందని, ఓటాన్ అకౌంట్‌తో ఇన్నాళ్లు నడిచే ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు గడుస్తున్నా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని దుయ్యబట్టారు.
ప్రజలు నిలదీస్తారని భయపడి.. కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెడితే సూపర్-6 ఎక్కడ అని ప్రజలు అడుగుతారని భయం బాబును వెంటాడుతుందని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మాదిరి.. బాబు అయిదు నెలల్లో డీబీటీ ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు.
ఇసుక, మద్యం, ఎక్కడ చూసినా దోపిడియే.కప్పం కట్టనిదే పనులు జరగడం లేదు.రాష్ట్ర వ్యాప్తంగా దోచుకో పంచుకో తినుకో మాఫియా నడుస్తోంది.చంద్రబాబు అబద్దాలకు రెక్కలు కట్టాడు. ఎన్నికలప్పుడు ప్రజల ఆశలతో చెలగాటమాడుతూ తప్పుడు ప్రచారాలు.రూ. 10 వేలు జీతమని చెప్పి వాలంటీర్లను మోసం చేశాడన్నారు. ఎన్నికల్లో ఇష్టారీతిన అమలుకాని హామీలు ఇచ్చారు.అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తారు. అధికారంలోకి వచ్చాక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వాళ్లకున్న మీడియా సామ్రాజ్యంలో గోబెల్స్ ప్రచారం చేస్తారు. ఓవైపు ఇసుక ఉచితం అంటారు.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది.మద్యంలోనూ చంద్రబాబు మాఫియా కొనసాగుతోందని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీస్‌కు అనుమతి లేదు.చంద్రబాబు మద్యంలోనూ మాఫియాను నడుపుతున్నారు.రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే అందులో అందులో 14డిస్టిలరీకి లైసెన్స్‌లు బాబు హయాంలో వచ్చినవే.మా హయాంలో ఇక్క డిస్టిలరీకి పర్మీషన్ ఇవ్వలేదు.నాసిరకం లిక్కర్ అంటూ ఆ నాడు దుర్మార్గపు ప్రచారం చేశారు.బాబు వస్తే లిక్కర్ క్వాలిటీ పెంచి ఇస్తామని ప్రచారం చేశారు.మద్యాన్ని కూడా చంద్రబాబు మాఫియాలా మార్చారు.బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్,999 లెజెండ్ , 999 పవర్ స్టార్ బ్రాండ్లన్నీ చంద్రబాబు తెచ్చినవే.ఈ బ్రాండ్లన్నీ మనహయాంలో తెచ్చినవే అంటూ అబద్ధాలు ప్రచారం చేశారు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ బ్రాండ్లన్నీ రిలీజ్ చేశారు. మద్యాన్ని కూడా చంద్రబాబు మాఫియాలా మార్చారు.
ఈ మాఫియాకు చంద్రబాబు పాత్ర దారి సూత్ర దారి.చంద్రబాబు హయాంలో 43వేల బెల్ట్ షాపులు నడిచేవి.మేం వచ్చాక బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దు చేశాం
మద్యాన్ని నియంత్రించగలిగాం.. పేదలకు మంచి చేయగలిగాం..వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.మద్యాన్ని నియంత్రిస్తూనే ఆదాయాన్ని పెంచగలిగాం.మద్యాన్ని నియంత్రించగలిగాం.. పేదలకు మంచి చేయగలిగాం..చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతుంది.ప్రభుత్వం నడుతుపుతున్న షాపులను చంద్రబాబు రద్దు చేశారు.తన మాఫియాకు స్రామజ్యానికి మొత్తం మద్యం షాపులను కట్టబెట్టారు. మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున స్కామ్‌లు చేయిస్తున్నారు.
మద్యం రేట్లు తగ్గిస్తామని చంద్రబాబు ప్రచారం చేశారు.ఇది నిజంగా పెద్ద స్కాం.వాటాలేసుకుని పంచుకోవడానికే మద్యం పాలసీ తెచ్చారు.లిక్కర్ పాలసీ నిజంగా మంచి చేసే పాలసీ అయితే ఎమ్మెల్యేలంతా ఎందుకు దాడులు చేస్తున్నారు.ఎమ్మార్పి రేట్ల కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముతున్నార.ఒక నెల ఆగితే ఇంకా రేట్లు పెరుగుతాయేమో. గ్రామ స్థాయిలోకి మద్యం మాఫియా నడుస్తోంది. ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ మొత్తానికి మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు.