YS Jagan Slams CM Chandrababu: 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అంటున్నారు, దేశంలోకెల్లా నంబర్‌ వన్‌ పార్టీగా మనం ఎదుగుతామంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

జగన్‌ మాట్లాడుతూ.. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు.

YS Jagan Mohan Reddy Slams Cm Chandrababu in YSRCP Party Leaders Workshop

Vjy, Oct 17:  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లిలో నేడు పార్టీ నేతలతో వర్క్‌ షాప్‌ నిర్వహించారు.  ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుంది. పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంది. ప్రతిపక్షంగా, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగా పార్టీ కొనసాగుతోంది. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగింది. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడే మనం రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎఫెక్టివ్‌గా ఉంటాం.

ప్రత్తిపాడులో చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత ముదునూరి మురళీకృష్ణంరాజు

జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన సన్నద్ధంగా ఉంటాం. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల వరకూ కమిటీలు ఎలా ఉన్నాయి? అన్నదానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతీ ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశమయ్యే నాటికి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. అనుబంధ విభాగాలకు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. కమిటీలు ఏర్పాటు అన్నది కాగితాలకే పరిమితం కాకూడదు. దానివల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటపై పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్‌ వన్‌ పార్టీగా మనం ఎదుగుతాం.

గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. అప్పుడు మనం ఇచ్చిన పిలుపునకు ఉద్ధృతమైన స్పందన వస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అంశాలపై స్పందించాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై మాట్లాడాలి. బాధితులకు అండగా నిలవాలి.

ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అని ప్రజలు చెప్పే పరిస్థితి నెలకొంది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే చెప్తారు. ఇప్పటికీ మనం ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలం. ఎన్నికల మేనిఫెస్టోకు అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది.

బడ్జెట్‌తోపాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సంక్షేమ క్యాలెండర్‌ రిలీజ్‌ చేసేవాళ్లం. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా మనం వెనకాడం కాని, అబద్ధాలు చెప్పలేం. నేను ఈ మాటలు చెప్తే ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. విలువలు, విశ్వసనీయ అనే పదాలకు అర్థం ఉండాలి.

అధికారం ఉండొచ్చు.. పోవచ్చు. కానీ, మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకువచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ప్రజలు మనం చేసిన మంచి పనుల గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పివన్నీ జగన్‌ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా?. టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు. ప్రతీ కుటుంబానికి మంచి చేసే కార్యక్రమాలు మనం చేశాం. కానీ, చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు. ప్రతీ ఇంటికీ మన నాయకులు డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేశారు. మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రిపేర్‌గా ఉండాల్సిన సమయం వచ్చింది.

ఆరోగ్య శ్రీ పూర్తిగా నీరుగారిపోయింది, ఆరోగ్య ఆసరా లేదు. ఆస్పత్రులు నిర్వీర్యం అయిపోయాయి. మూడు త్రైమాసికాలు వచ్చినా.. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లీష్‌ మీడియం లేదు, సీబీఎస్‌ఈ లేదు, టోఫెల్‌ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఉచిత ఇన్సూరెన్స్‌ గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి.

పంటలకు ఎంఎస్‌పీలు రాని పరిస్థితి నెలకొంది. ఇంటివద్దకు సేవలు నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలి. లక్షన్నర పెన్షన్లు ఇప్పటికే తొలగించారు. లా అండ్‌ ఆర్డర్‌ ఘోరంగా ఉంది. దిశ యాప్‌ కూడా ఏమైందో తెలియదు. దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగ కేసులకు పరిమితం అయ్యారు. డ్యూటీ మరిచిపోయి మూడు సింహాలకు సెల్యూట్‌ కాకుండా, రాజకీయనాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now