Andhra Pradesh Rains: నెల్లూరు జిల్లాకు హై అలర్ట్, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Andhra Pradesh Rains: Heavy Rains in These Districts Over Low Pressure

Vjy, Oct 14: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదు అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను గుర్తించి సత్వర చర్యలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వీటితోపాటు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ఉదయం నుంచే పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో భారీగా వర్షం కురుస్తోంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో ఇప్పటికే పలు జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలకు కలెక్టర్ శెలవు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అల్పపీడనం, తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఆదివారం ఆయన వెబెక్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు. తుఫాన్ వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడా నికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.