West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
కారు అదుపుతప్పి నరసాపురం కాలువలోకి దూసుకెళ్లడంతో (Car Fell Into Canal) ముగ్గురు చనిపోయారు. బాధితులు కారులో నరసాపురం మచ్చసిరి నుంచి రాజమహేంద్ర వరం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Amaravathi, Mar 04: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా పోడూర మండలం జగన్నాధపురం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి నరసాపురం కాలువలోకి దూసుకెళ్లడంతో (Car Fell Into Canal) ముగ్గురు చనిపోయారు. బాధితులు కారులో నరసాపురం మచ్చసిరి నుంచి రాజమహేంద్ర వరం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
చనిపోయిన వారిని యలమంచిలి మండలం కాజా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు అగ్నిప్రమాద సిబ్బంది సాయంతో కారును వెలికి తీసారు. కాగా కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద వాగులోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాకుమాను గ్రామానికి చెందిన బాధితులు గుంటూరు రూరల్ మండం ఏటుకూరులో జరిగిన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Here's ANI Tweet
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తాండా వద్ద క్వారీ గుంతలో మిర్చి లారీ బోల్తా పడి ఐదుగురు రైతులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. బోధిలవీడుకు చెందిన రైతులు మిర్చి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదాలన్నీ అతివేగం వల్లే చోటుచేసుకున్నాయి.