Delhi Weather: కాలు బ‌య‌ట‌పెట్టాలంటే వ‌ణికిపోతున్న ఢిల్లీ ప్ర‌జ‌లు, దారుణంగా ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు (Video)

తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Cold) చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల్లో లాగే ఇవాళ ఉదయం కూడా అక్కడ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు (Mercury Drops To 4 Degrees Celsius) నమోదయ్యాయి.

Credits: Istock

New Delhi, JAN 17: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రంగా (Cold wave) ఉంది. తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Cold) చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల్లో లాగే ఇవాళ ఉదయం కూడా అక్కడ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు (Mercury Drops To 4 Degrees Celsius) నమోదయ్యాయి. ఉదయం పూట బయటికి వచ్చిన చలికి గజగజ వణుకుతున్నారు.

 

ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం చలిమంటలు వేసుకుని చలి కాగుతున్నారు. ఇళ్లు కూడా లేని నిస్సహాయులకు ఢిల్లీలోని నైట్‌ షెల్టర్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఫుట్‌పాత్‌లపై ఉండే పలువురు రాత్రి వేళల్లో ఆ నైట్‌ షెల్టర్‌లలో తలదాచుకుంటున్నారు.

 

చలి కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముతోంది. దాంతో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

 

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిలో పలు రైళ్లు కూడా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు