Internet Suspended: సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అలీఘడ్‌లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేత, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయవద్దన్న పోలీస్ శాఖ
యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో (Aligarh) ఈ నెల 26వతేదీ అర్దరాత్రి వరకు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు జిల్లా మేనేజరు మనోజ్ రాజ్‌పుత్ చెప్పారు.
Lucknow, Febuary 26: దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏకి (CAA) వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ (Home Ministry) అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాపై (Social Media) చాలా జాగ్రత్తగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ పై (Internet) ఆంక్షలు విధించనున్నారు.
యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో (Aligarh) ఈ నెల 26వతేదీ అర్దరాత్రి వరకు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు జిల్లా మేనేజరు మనోజ్ రాజ్‌పుత్ చెప్పారు.
ఆదివారం నిరసనకారులు సీఏఏకు వ్యతిరేకంగా రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారని అలీఘడ్ జిల్లా మెజిస్ట్రేట్ చంద్రభూషణ్ సింగ్ చెప్పారు. పోలీసు వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతోనే బాష్పవాయుగోళాలను ప్రయోగించాల్సి వచ్చిందని మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయవద్దని చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ తెలిపింది.
రావణకాష్టంలా మారిన ఢిల్లీ, అర్థరాత్రి రంగంలోకి దిగిన అజిత్ డోవల్
పోలీసులు కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేశారనే పుకార్లు వ్యాపించడంతో ప్రజలు రాళ్లు రువ్వారని పోలీసు అధికారి రామశాస్త్రి చెప్పారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా మళ్లీ ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. నేటి అర్థ రాత్రి వరకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండదని ఆయన తెలిపారు.
కాగా ఈశాన్య దిల్లీలోని (North East Delhi) గోకుల్‌పురి ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు సోమవారం హద్దులు మీరాయి. సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో (Violence) దిల్లీ పోలీసుల హెడ్ కానిస్టేబుల్ మరణించాడు. ఇరుపక్షాలు రాళ్లు రువ్వుకోవడంతో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ (Head constable Ratan Lal )
తలకు ఒక రాయి వచ్చి బలంగా తాకింది. దీంతో రతన్ లాల్ అక్కడికక్కడే కుప్పకులారు. ఈ రాళ్ల దాడిలో డిప్యూటీ కమిషనర్ (DCP) స్థాయి కలిగిన మరో పోలీసు అధికారి అమిత్ శర్మకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన సమీపంలోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు.