New CCTV Clip of Satyendar Jain: ఢిల్లీ మంత్రికి సంబంధించిన సంచలన వీడియో విడుదల, ఈ సారి జైల్లో ఏం చేశారో తెలుసా? ఎంసీడీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ బయటకు వస్తున్న వరుస వీడియోలు
జైన్‌ను కలిసిన వారిలో సస్పెండ్ అయిన ఆ జైలు మాజీ సూపరింటెండెంట్ (Jail Chief) ఉన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో జైన్ సెల్‌లో కొందరు ముచ్చట్లు పెట్టారు. దానికి సంబంధించిన 10 నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు. జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్.. జైన్ సెల్‌లోకి వచ్చిన తర్వాత .. అక్కడ ఉన్న కొందరు బయటకు వెళ్లారు.
New Delhi, NOV 26: మనీల్యాండరింగ్ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు (Satyendar Jain) చెందిన మరో వీడియోను రిలీజ్ చేశారు. తీహార్ జైలులో (Tihar jail) ఉంటున్న ఆయన.. తన సెల్‌లోనే అతిథుల్ని కలిశారు. జైన్‌ను కలిసిన వారిలో సస్పెండ్ అయిన ఆ జైలు మాజీ సూపరింటెండెంట్ (Jail Chief) ఉన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో జైన్ సెల్‌లో కొందరు ముచ్చట్లు పెట్టారు. దానికి సంబంధించిన 10 నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు. జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్.. జైన్ సెల్‌లోకి వచ్చిన తర్వాత .. అక్కడ ఉన్న కొందరు బయటకు వెళ్లారు. ఇటీవల సత్యేందర్‌కు చెందిన వీడియోలను వరుసగా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
సెల్‌లోనే ఆయన మసాజ్ చేయించుకున్నారు. ఇక రుచికరమైన భోజనం, పండ్లు తీసుకుంటున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. వచ్చే నెలలో ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సత్యేందర్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు.
అయితే సత్యంద్రజైన్ కు సంబంధించిన వీడియోలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆచితూచి మాట్లాడుతోంది. తొలుత సత్యేంద్రకు చేసింది మసాజ్ కాదు ఫిజియోథెరపి అంటూ సిసోడియా కామెంట్ చేశారు. కానీ జైన్‌కు మసాజ్ చేసిన వ్యక్తి థెరపిస్ట్ కాదు, రేపిస్ట్ అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. దాంతో తర్వాతి వీడియోలపై అగ్రనాయకత్వం పెద్దగా స్పందించడం లేదు. ఆప్ నేతలు మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర అంటూ ఆరోపణలు చేస్తున్నారు.