Arunachal Pradesh Clash: భారత్-చైనా మధ్య ఘర్షణ, నేడు ఉభయ సభల్లో ప్రకటన చేయనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, తవాంగ్ జిల్లాలో భారత్ భూబాగంలోకి చొచ్చుకువచ్చిన డ్రాగన్ సైనికులు

లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనలు చేసే అవకాశం ఉన్నది.

Rajanath Singh (Photo-ANI)

New Delhi, Dec 13: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌-చైనా దేశాల సైనికుల మధ్య తాజాగా చోటుచేసుకున్న ఘర్షణలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటనలు చేయనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనలు చేసే అవకాశం ఉన్నది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఈ నెల 9న భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు సైనికులకు గాయాలయ్యాయి. చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకురావడం ఘర్షణకు దారితీసింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ఘటన తవాంగ్ జిల్లాలోని యంగ్‌స్టెలో ఈ సంఘటన డిసెంబర్ 9, 2022న చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా తవాంగ్‌లోని LACని చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది.

తవాంగ్ వద్ద భారత్ సరిహద్దులోకి చొరబాడాలని చూసిన చైనా సైనికుల తిక్క కుదిర్చిన భారత జవాన్లు, పెద్ద సంఖ్యలో చైనా సైనికులకు గాయాలు అయినట్లు రిపోర్టు..

చైనా సైనికుల ఈ చర్యను అక్కడ ఉన్న భారత సైనికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఇరు సేనల మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇరు దేశాలకు చెందిన కొందరు సైనికులు గాయపడ్డారు. అయితే, LAC చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా దళాలను భారత సైనికులు వెనక్కి నెట్టారు.కాగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చేతగాని తనంవల్లే చైనా రెచ్చిపోతున్నదని విమర్శిస్తున్నాయి.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు