Delhi Excise Policy Case: అధికారులు బెల్ట్ తీసుకోవడంతో నా ఫ్యాంట్ పదే పదే జారిపోతోంది, కోర్టుకు విన్నవించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కోర్టు ఏమన్నదంటే..

సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అనుమతి లభించింది.

Delhi CM Arvind Kejriwal (photo-ANI

New Delhi, June 27: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ మూడు రోజుల కస్టడీలోకి తీసుకుంది. సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అనుమతి లభించింది. ఇంటి భోజనానికి అనుమతించాలని, అలాగే.. కళ్లద్దాలు, డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరారు. అలాగే.. ప్యాంట్‌ బెల్ట్‌ లేకపోవడంతో తాను ఇబ్బంది పడుతున్నానని, జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంట్‌ను చేత్తో పట్టుకుని ఉండాల్సి వస్తోందని, కాబట్టి దానిని కూడా అనుమతించాలని కోరారు.  ఢిల్లీ మద్యం పాలసీ కేసు, మూడురోజుల సీబీఐ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్, 29న సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాలని ఆదేశాలు

గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నిర్బంధించిన సమయంలో, అతను తన ప్యాంటు పైకి పట్టుకోవలసి వచ్చిందని, తన బెల్ట్ తీయబడినందున "ఇబ్బందిగా" అనిపించిందని అతను వివరించాడు. వీటన్నింటికి కోర్టు అనుమతించింది. ఈ విజ్ఞప్తులతో పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను.. ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసన అనంతరం కేజ్రీవాల్‌ను జూన్‌ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపచనున్నారు. ఇప్పటికే మనీలాండరింగ్‌లో కేసులో అరెస్టై తిహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను.. విచారణ జరిపి మరీ బుధవారం సీబీఐ అరెస్ట్‌ చేసింది. సీబీఐ అరెస్ట్‌ నేపథ్యంలో సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు.. కొత్త పిటిషన్‌ వేసే యోచనలో ఉన్నారు.

మద్యం అమ్మకాలను ఆధునీకరించే లక్ష్యంతో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 2021లో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ అరెస్టు జరిగింది.జూలై 2022లో, ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ పాలసీ ఉల్లంఘనలను నివేదించారు, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఖజానాకు రూ. 580 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఫలితంగా జూలై 2022లో పాలసీ రద్దు చేయబడిందని నివేదిక పేర్కొంది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif