Delhi Minor Rape Case: మామా అని పిలిచినందుకు నెలల తరబడి బాలికపై అత్యాచారం, స్నేహితుడు కుమార్తెపై ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి దారుణం, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ సీఎం
ఉన్నత హోదాలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి (Delhi Officer) స్నేహితుడి కుమార్తెపై తన ఇంట్లో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చగా అతడి భార్య పిల్స్ ఇచ్చి నివారించింది
Delhi Government Official Minor Rape Case: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉన్నత హోదాలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి (Delhi Officer) స్నేహితుడి కుమార్తెపై తన ఇంట్లో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చగా అతడి భార్య పిల్స్ ఇచ్చి నివారించింది.ఈ ఘటనలో ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సాయంత్రం 5 గంటల్లోగా ఈ ఘటనకు సంబంధించి నివేదిక అందించాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే..మహిళా శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్ ప్రమోదయ్ ఖాఖాకు.. తన స్నేహితుడు కుమార్తెతో తొలిసారి చర్చిలో పరిచయం ఏర్పడింది. 2020 అక్టోబర్1న స్నేహితుడు మరణించడంతో అతడి కుమార్తె బాధ్యతను తాను చూసుకుంటానని చెప్పాడు. అనంతరం 12వ తరగతి చదువుతున్న ఆ బాలికను తన ఇంటికే తీసుకెళ్లాడు. బాలిక అతన్ని మామ అని పిలిచేది.
ఈ క్రమంలో నవంబర్ 2020 నుంచి 2021 జనవరి మధ్య అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం నిందితుడు భార్యకు బాధితురాలు తెలియజేయగా.. బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమె కూడా అతడికి సహకరించింది. తన కుమారుడితో గర్భస్రావ మాత్రలు తెప్పించి బాలికతో మింగించింది. అనంతరం 2021 జనవరిలో తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది.
అయితే బాలిక ఈ నెలలో అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆమె తల్లికి సమాచారమివ్వగా తనకు ఎదురైన వేధింపులను ఆమెకు వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.నిందితుడిపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఆమె ఇంకా కోలుకుంటోంది. మరోవైపు బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదైంది.
భార్యాభర్తలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు. మెజిస్ట్రేట్ ఎదుట ఆమె స్టెట్‌మెంట్ రికార్డ్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. దాని ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.దీంతో ప్రమోదయ్ ఖాఖాతోపాటు ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఆప్ నేత సురభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. ‘సదరు అధికారి చేసింది హేయమైన పని. నిందితుడి భార్య కూడా ఈ నేరంలో భాగమైంది. ఈ ఘటన సమాజానికి మాయని మచ్చ. ఇలాంటి చర్యలను సహించేది లేదు. నిందితుడైన అధికారిని సస్పెండ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. సీఎస్ నుంచి సాయంత్ర 5 గంటల వరకు నివేదిక కోరారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం ఢిల్లీ పోలీసులు విఫలమవ్వడం దారుణమైన అంశం. ఇది సిగ్గుమాలిన చర్చ. ఆ అధికారిని చట్టపరంగా పూర్తి స్థాయిలో శిక్షించాలి’ అని పేర్కొన్నారు.