Assam: అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్, యువతకు ఉద్యోగాలు, అస్సాంలో కేజ్రీవాల్ హామీల వర్షం, హిమంత శర్మపై సెటర్లు వేసిన కేజ్రీవాల్

అస్సాంలో పర్యటించిన ఆయన....హామీల జల్లు కురిపించారు. ఇప్పటికే పంజాబ్, ఢిల్లీల్లోతమ హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక అస్సాం సీఎం హిమంతపై సెటైర్లు వేశారు కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal (PIC @ ANI twitter)

Guwahati, April 02: అస్సాంలో అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ). అస్సాంలో పర్యటించిన ఆయన....హామీల జల్లు కురిపించారు. ఇప్పటికే పంజాబ్, ఢిల్లీల్లోతమ హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక అస్సాం సీఎం హిమంతపై సెటైర్లు వేశారు కేజ్రీవాల్. “హిమంత బాబు.. మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లండి” అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను (Himantha) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారు. ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి కేజ్రీవాల్  అసోంలోని గువాహటికి వెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. హిమంత బిశ్వ శర్మ ఢిల్లీకి వచ్చి తన ఇంట్లో టీ తాగాలని, అలాగే, ఆయనకు దేశ రాజధానికి దగ్గరుండి చూపిస్తానని కేజ్రీవాల్ చెప్పారు.

“నన్ను అసోంకి రావాలని హిమంత బిశ్వశర్మ ఎందుకు బెదిరిస్తున్నారు. నన్ను జైల్లో పెడతారా? నేను హిమంత బిశ్వశర్మకు ఓ విషయం సూచిస్తున్నాను. ఆయన అసోం సంస్కృతి, సంప్రదాయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి” అని కేజ్రీవాల్ అన్నారు. అసోం ప్రజలు హిమంత బిశ్వ శర్మలా వ్యవహరించబోరని, మంచి ఆతిథ్యాన్ని ఇస్తారని చెప్పారు. అతిథులను బెదిరించబోరని అన్నారు.

కాగా, కొన్ని రోజులుగా కేజ్రీవాల్ పై హిమంత బిశ్వశర్మ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తనపై కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు ఏదైనా ఉంటే చూపించాలని కేజ్రీవాల్ కు హిమంత బిశ్వశర్మ సవాలు విసిరారు. అసోంకి వచ్చి తనపై అవినీతి ఆరోపణలు ఏవైనా చేస్తే కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందించారు.



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన