Assam: చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా ఇద్దరు యువతులు, అత్యాచారం చేసి చంపేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు, అస్సాంలో అత్యంత దారుణమైన ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇద్దరు మైనర్లు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా (Two Minor Sisters Found Hanging from Tree) కనిపించిన ఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వాళ్లను అత్యాచారం చేసి ఆపై చంపేశారని ( Family Claims Rape, Murder) కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

representational image (photo-Getty)

Kokrajhar/Dhubri, June 13: అస్సాంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్లు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా (Two Minor Sisters Found Hanging from Tree) కనిపించిన ఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వాళ్లను అత్యాచారం చేసి ఆపై చంపేశారని ( Family Claims Rape, Murder) కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన అక్కడి మీడియాలో ఎక్కువ ఫోకస్‌ కావడంతో ఆదివారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. కోక్రాజ్‌హర్‌ జిల్లా అభయకుటి గ్రామం శివారులోని అడవుల్లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది.దారుణ ఘటన వివరాల్లకోళితే.. వరుసకు చుట్టాలయ్యే ఆ ఇద్దరు అమ్మాయిలు.. ఒకరి వయసు 16, మరొకరి వయసు 14. ఇద్దరూ పొలం పనులకు వెళ్లారని, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆ ఇద్దరూ కనిపించకుండా పోయారని బంధవులు చెప్తున్నారు. ఇప్పుడు ఇలా చెట్టుకు వేలాడుతూ కనిపించారని చెబుతున్నారు.

క్రూర మృగాలైన కామాంధులు, యువతికి కామోద్దీప‌నాలు కలిగించే ఇంజెక్ష‌న్లు, ట్యాబెట్లు ఇస్తూ 8 ఏళ్లుగా అత్యాచారం, 27 పేజీలతో ఫిర్యాదు చేసిన బాధితురాలు, ముంబై నంగరంలోని అంధేరిలో దారుణ ఘటన

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్‌ ఆస్పత్రికి తరలించి.. నివేదిక కోసం ఎదురు చూస్తు‍న్నారు. బాధితుల్లో ఒకరు అనాథ కాగా, మరొక తల్లి రోదనలతో అభయకుటిలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ జ్యుడిషియల్‌ ఎంక్వైరీ డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనలో అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు కోక్రాజ్‌హర్‌ పోలీసులు చెప్తున్నారు.