Rahul Gandhi on Terrorists: ఉగ్రవాదులు నన్ను కూడా చంపేసే వారు, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు
ఈ రోజు లండన్ లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. లెర్నింగ్ టు లిజన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై రాహుల్ గాంధీ ప్రసంగించారు.
Brittan, Mar 3: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. ఈ రోజు లండన్ లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. లెర్నింగ్ టు లిజన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. తన ప్రసంగంలో భాగంగా తాను చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలో కొన్ని అనుభవాలను షేర్ చేసుకున్నారు.
భారత్ జోడో యాత్ర చివరలో జమ్మూ కశ్మీర్ లో (Jammu and Kashmir) పాదయాత్ర చేస్తుండగా, ఉగ్రవాదులను అత్యంత దగ్గర నుంచి చూశానని (Rahul Gandhi says he was seen terrorists ) వెల్లడించారు. పాదయాత్ర జమ్మూ కశ్మీర్ చేరుకోగానే, ఇక ముందుకు వెళ్లొద్దని భద్రతా సిబ్బంది సూచించారని, కానీ పార్టీ వర్గాలతో చర్చించిన తర్వాత పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
పాదయాత్ర చేస్తుండగా ఓ కొత్త వ్యక్తి నా వద్దకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగానే కశ్మీర్ కు వచ్చి ప్రజల బాధల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఆ తర్వాత కాస్త అవతల నిలబడి ఉన్న కొందరిని చూపించి వాళ్లంతా టెర్రరిస్టులు (terrorists in Kashmir) అని వెల్లడించాడు. దాంతో నేను సమస్యల్లో చిక్కుకుంటున్నానా అని అనిపించింది. ఆ సమయంలో ఉగ్రవాదులు నన్ను చంపేసేందుకు అవకాశం ఉంది. కానీ వారు అలా చేయలేదు. నా నిబద్ధతను వారు గుర్తించారు. మేం వచ్చింది ప్రజా సమస్యలను వినడానికే అని వారు తెలుసుకున్నారని వివరించారు.
ఈ ప్రసంగంలోనే మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన వ్యవస్ధలు నిర్భందానికి లోనవుతున్నాయని వ్యాఖ్యానించారు. తనపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్ వాడుతోందని అన్నారు.
21వ శతాబ్ధంలో బోధనలు అనే అంశంపై వర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. విపక్ష నేతలపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్‌ను వినియోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన ఫోన్‌పైనా పెగాసస్‌తో నిఘా పెట్టారని వివరించారు. తనతో సహా విపక్ష నేతలపై ఫోన్లపై నిఘా పెట్టారని, తాను ఫోన్‌లో మాట్లాడేసమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.మీడియా, న్యాయవ్యవస్ధను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుందని మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో చెలరేగుతూ అసమ్మతిని అణిచివేస్తోందని దుయ్యబట్టారు.
గతేడాది సెప్టెంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ ఈ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపట్టారు. 12 రాష్ట్రాల మీదుగా పాదయాత్ర చేసి ఈ ఏడాది జనవరి 30న కశ్మీర్‌లో ముగించారు. కశ్మీర్‌లోకి జోడో యాత్ర ప్రవేశించినప్పుడు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యాయి. భద్రతా సిబ్బంది లేకపోవడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆ మధ్య కాంగ్రెస్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.