Atiq Ahmad-Ashraf Killing: అతిక్ అహ్మద్‌లను అందుకే చంపాం! హంతకుల నోటి నుంచి సంచలన నిజాలు, అతీక్‌ సోదరుల హత్యకేసు విచారణకు ప్రత్యేక కమిటీ, రెండు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశం

ఈ కేసులో విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని (Three-Member Judicial Committee) నియమించింది యూపీ సర్కారు.

Atiq Ahmad, His Brother Ashraf Shot Dead (PIC @ ANI Twitter)

Lucknow, April 16: ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ (UP Gangster), మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmad), అతడి సోదరుడు అష్రఫ్‌ల హత్య కేసులో విచారణను వేగవంతం చేసింది యూపీ ప్రభుత్వం. ఈ కేసులో విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని (Three-Member Judicial Committee) నియమించింది యూపీ సర్కారు. ఇందులో రిటైర్డ్ జడ్జి అరవింద్ కుమార్ త్రిపాఠి, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సుబేష్ కుమార్ సింగ్, రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ ఉన్నారు. రెండు నెలల్లో విచారణను పూర్తి చేయాలని కమిటీకి గడవు విధించింది యూపీ సర్కారు. అయితే అతిక్, అష్రఫ్ హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతీక్‌ గ్యాంగ్‌ను ఖతం చేసి, పేరు సంపాదించాలనే.. వారిపై కాల్పులు జరిపామని నిందితులు వెల్లడించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ‘అతీక్‌, అష్రఫ్‌లను పోలీసు కస్టడీకి ఇచ్చినట్లు తెలియగానే వారిని చంపాలని నిర్ణయించుకున్నాం. అందుకే జర్నలిస్టు వేషంలో వెళ్లి అవకాశం దొరకగానే కాల్పులు జరిపాం. అతీక్‌పై కాల్పులు జరిపిన తర్వాత అక్కడినుంచి పారిపోవడం మా ఉద్దేశం కాదు. అతీక్‌, అష్రఫ్‌లను మట్టుపెట్టడం ద్వారా రాష్ట్రంలో మాకంటూ పేరు, గుర్తింపు తెచ్చుకోవాలనేదే మా లక్ష్యం. భవిష్యత్తులో తప్పకుండా ప్రయోజనం పొందుతాం’ అని విచారణ సమయంలో నిందితులు తెలిపిన విషయాలను పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.

Atiq Ahmad Murder: పోలీసుల సమక్షంలో మీడియాతో మాట్లాడుతుండగానే అతిక్‌ అహ్మద్‌పై కాల్పులు, స్పాట్‌లోనే చనిపోయిన అతిక్, అష్రఫ్, కాల్పులు జరిపిన ముగ్గురు అరెస్ట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అతిక్ మర్డర్ వీడియో (Watch Video) 

ఓ కేసు విచారణ నిమిత్తం అతీక్‌ అహ్మద్ (Atiq Ahmad)‌, అతడి సోదరుడు అష్రఫ్‌లను తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. వారిని లావ్లేష్‌ తివారీ (22), మోహిత్‌ అలియాస్‌ సన్నీ (22), అరుణ్‌ మౌర్య (18)లుగా గుర్తించినట్లు పోలీసులు  వెల్లడించారు. బాందాకు చెందిన లావ్లేష్‌ తివారీ జులాయి అని.. డ్రగ్స్‌కు బానిసయ్యాడని స్థానికులు వెల్లడించారు.

Karnataka Elections 2023: కర్ణాటకలో బీజేపీకి షాక్, కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్, ఎన్నికల ముందు బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు.. 

అతనిపై ఇదివరకే కేసులు ఉన్నాయని, గతంలోనూ జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. నేరసామ్రాజ్యంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటుండేవాడని స్థానికులు వెల్లడించడం గమనార్హం. మరో నిందితుడు మోహిత్‌ కూడా అతని స్వస్థలంలో పదేళ్లుగా ఉండటం లేదని, పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లాడని స్థానికులు తెలిపారు. మరో నిందితుడు అరుణ్‌ మౌర్య నివాసముండే కాస్‌గంజ్‌ తాజా ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయిన మౌర్య.. దశాబ్దం క్రితమే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోయినట్లు అక్కడివారు తెలిపారు