Atiq Ahmad Murder: పోలీసుల సమక్షంలో మీడియాతో మాట్లాడుతుండగానే అతిక్ అహ్మద్‌పై కాల్పులు, స్పాట్‌లోనే చనిపోయిన అతిక్, అష్రఫ్, కాల్పులు జరిపిన ముగ్గురు అరెస్ట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అతిక్ మర్డర్ వీడియో (Watch Video)
గ్యాంగ్ స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్ (Atiq Ahmad), అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf) ఈ కాల్పుల్లో హతమయ్యారు. ముగ్గురు వ్యక్తులు కాల్పులు (Open Fire) జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Lucknow, April 15: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో (Prayagraj) కాల్పుల కలకలం చెలరేగింది. గ్యాంగ్ స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్ (Atiq Ahmad), అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf) ఈ కాల్పుల్లో హతమయ్యారు. ముగ్గురు వ్యక్తులు కాల్పులు (Open Fire) జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ ను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో అక్కడికి మీడియా వచ్చింది. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ (AtiqueAhmed) మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో వెనుక నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. దుండగులు నేరుగా అతిక్ అహ్మద్, అతడి సోదరుడిపై కాల్పులు జరిపారు. దాంతో వారిద్దరూ స్పాట్ లోనే చనిపోయారు.
పోలీసు కస్టడీలో ఉండగానే వారిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పులకు సంబంధించిన వీడియో వైరల్ గా (Atiq Ahmad murder Video) మారింది. ఈ కాల్పుల ఘటన ప్రయాగ్ రాజ్ లో ప్రస్తుతం సంచలనమైంది.
మూడు రోజుల క్రితమే అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ (Asad ahmad) ని ఝాన్సీ ప్రాంతంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ సంచలనం రేపింది. అది జరిగిన మూడు రోజులకే తండ్రి అతిక్ అహ్మద్ కూడా హతమయ్యాడు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ పై ఆరోపణలు ఉన్నాయి.