ATM Withdrawal Charges: ఏటీఏంలో పదే పదే డబ్బులు తీస్తున్నారా, అయితే ఈ ఛార్జీల బాదుడు గురించి ముందుగా తెలుసుకోండి, అయిదు లావాదేవీలు దాటితే ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందో పూర్తి వివరాలు ఇవే..

ఇకపై బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్‌ చార్జీల బాదుడిని (ATM Withdrawal Charges) మొదలెట్టాయి.

ATM Machine | Image Used for Representational Purpose Only | (Photo Credits: Money Control.com)

బ్యాంక్‌ కస్టమర్లకు పలు బ్యాంకులు భారీ షాక్‌ ఇచ్చాయి.ఏటీఎంల్లో లావాదేవీలపై ఛార్జీలను పెంచేశాయి. ఇకపై బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్‌ చార్జీల బాదుడిని (ATM Withdrawal Charges) మొదలెట్టాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఏటీఎం పై ప్రతి ప్రాంతంలో ఉచితంగా 5 లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది.ఇక మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంక్ ఏటీఎం( ATM)లలో ఈ సంఖ్య మూడుకి తగ్గించింది. అవి ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్. ఒకవేళ ఈ పరిమితి దాటి విత్‌డ్రా చేస్తే.. ఎస్‌బీఐ ఏటీఎంల్లో 5 లావాదేవీలు దాటాక ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి దాటి జరిపే వాటిపై రూ.20 వసూలు చేస్తుంది.

HDFC బ్యాంక్ తన ఏటీఎం (ATM) నుంచి నెలకు 5 చొప్పున ఉచిత లావాదేవీలను అందిస్తుంది. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మూడు కాగా, నాన్ మెట్రో నగరాల్లో ఐదు అనుమతిస్తోంది. ఆ తర్వాత, విత్‌డ్రా చేస్తే రూ. 21 చెల్లించాల్సిందే. అలాగే ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 ఛార్జ్ చేస్తారు. ఇక ICICI బ్యాంక్ కూడా 5, 3 రూల్స్‌ని పాటిస్తుంది.

SBI ఖాతా బ్లాక్ కాకుండా ఉండేందుకు పాన్ అప్‌డేట్ చేయాలంటూ మెసేజ్, ఆ వార్త ఫేక్..ఎవరూ నమ్మవద్దని తెలిపిన PIB ఫ్యాక్ట్ చెక్ బృందం

ఆరు మెట్రో స్థానాల్లో(ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) ఐసీఐసీఐ ఏటీఎం ( ATM) నుంచి 5 విత్‌డ్రాలు, ఇతర బ్యాంక్ ATMల నుంచి 3 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉచితం. దీని తర్వాత, బ్యాంకు ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ సొంత ఏటీఎంల్లో మెట్రో సిటీల పరిధిలో 5 ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒకవేళ ఈ పరిమితి దాటిన ప్రతి నగదు లావాదేవీలపై రూ.21, ఆర్థికేతర లావాదీవీలపైన రూ.10 వసూలు చేస్తుంది.

అలాగే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ) కూడా మెట్రో పాలిటన్‌ సిటీల పరిధిలో తమ ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు మాత్రమే ఉచితం. అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, ఆర్థికేతర లావాదీవీల మీద రూ. 9 చార్జ్‌ చేస్తోంది.