IPL Auction 2025 Live

Aurangabad Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు, 16 మంది మృతి, పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ

రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 14మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున 5.15 గంటలకు కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.

Train Accident in Karmad, Auranagabad (Photo Credits: ANI)

New Delhi, May 8: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం (Aurangabad Train Accident) చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 16 మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున 5.15 గంటలకు కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. గ్యాస్ లీకయిన వెంటనే రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్ నేవీ బృందాలు, లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగేది, మీడియాతో ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో (Maharashtra Train Accident) చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పందించారు. 16 మంది వలస కార్మికులు మృతిచెందడంపై తీవ్ర వేదనకు గురైనట్లు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్పందిస్తూ... ఘటనపై రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో (Piyush Goyal) మాట్లాడినట్లు తెలిపారు. పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా తెలిపినట్లు చెప్పారు. కావాల్సిన అన్ని సహాయ, సహకారాలను అందించనున్నట్లు వెల్లడించారు.

Here's the tweet by PM Narendra Modi:

Here's the tweet:

లాక్‌డౌన్‌ వల్ల జల్నాలోని ఐరన్‌ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు. జల్నా నుంచి భూస్వాల్‌ వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి రైలులో మధ్యప్రదేశ్‌ వెళ్లాలని వారు భావించారు. అయితే దాదాపు 45 కి.మీ దూరం నడిచాక వారు రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్‌, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.