Ayodhya In High Security Zone: అయోధ్యలో రెండు రోజుల పాటూ హై అల‌ర్ట్, సరిహ‌ద్దుల‌న్నీ మూసివేత‌, బ‌య‌ట వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు

శనివారం నుంచి సోమవారం వరకు అయోధ్య ధామ్‌ హై సెక్యూరిటీ జోన్‌లో (High Security Zone) ఉండనున్నది. ఈ క్రమంలో సరిహద్దులన్నీ మూసివేయనున్నారు. అయోధ్య ధామ్ లోపలికి బయటి వాహనాలను అనుమతి ఇవ్వడం లేదు.

Ayodhya Train Station Renamed Ahead Of Temple Inauguration. New Name Is Ayodhya Dham junction (photo-ANI)

Ayodhya, JAN 20: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు (Ayodhya) సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 500 సంవత్సరాల భారతీయుల కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. ఈ నెల 22న రామ్‌లల్లా (Ram lalla) కొలువుదీరబోతున్నారు. ఈ ఆనంద క్షణాల కోసం యావత్‌ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో వేడుకలకు పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జనవరి 20 నుంచి రాముడి నగరంలోకి బయటి వ్యక్తులకు ప్రవేశాన్ని నిలిపివేయనున్నారు. అయోధ్య ధామ్‌తో (Ayodhya) పాటు నగరంలో నివసించే ప్రజలు ఇండ్లకు చేరుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందుకోసం వారు తమ గుర్తింపు కార్డును చూపించాల్సి అధికారులు తెలిపారు.

Ram Lalla Leaked Pics: అయోధ్య బాల‌రాముడి ఫోటోలు నిజ‌మైన‌వి కావా? ఇంత‌కీ శిల్పి ఏం చెప్పారంటే? 

ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ప్రజలు ఎవరూ బయటకు వెళ్లొద్దని పోలీస్‌ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. శనివారం నుంచి సోమవారం వరకు అయోధ్య ధామ్‌ హై సెక్యూరిటీ జోన్‌లో (High Security Zone) ఉండనున్నది. ఈ క్రమంలో సరిహద్దులన్నీ మూసివేయనున్నారు. అయోధ్య ధామ్ లోపలికి బయటి వాహనాలను అనుమతి ఇవ్వడం లేదు. ఆయా వాహనాలను ఉదయ కూడలి, సాకేత్‌ పెట్రోల్‌ పంప్‌, నయాఘాట్‌, ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద నిలిపివేస్తున్నారు. అయోధ్య ధామ్ లోపల నివసించే వ్యక్తులు మాత్రమే ఇండ్లకు చేరుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

ఇదిలా ఉండగా.. రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. జానకి మాత జన్మస్థలమైన బిహార్‌లోని సీతామర్హి నుంచి ఐదు ట్రక్కుల్లో కానుకలు రామనగరానికి తరలించారు. 11,051 కానుకలను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇందులో వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, గోధుమలు, బియ్యం, స్వీట్లలో ఖాజా, లడ్డూతో పాటు బంగారు ఆభరణాలు సైతం ఉన్నాయని సీతామర్హి పునౌరా ధామ్‌ నిర్వాహకుడు శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif