First Images of Ram Lalla Idol Unveiled

Ayodhya, JAN 20: మరో రెండు రోజుల్లో అయ్యోధ శ్రీరాముడు(Ayodhya) కొలువుదీరనున్నాడు. రాముడి ప్రాణప్రతిష్ట వేడుక కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ నెల 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే గర్భ గుడిలోకి చేరుకున్న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రీరాముడి దివ్య మంగళ రూపం భక్తులను కనువిందు చేస్తోంది. కృష్ణశిలతో చెక్కిన విగ్రహం కళ్లకు పసుపు రంగు వస్త్రం చుట్టి గులాబీ దండతో బాలరాముడిని అలంకరించారు. నిలబడి ఉన్న భంగిమలో ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలు చూసి భక్తులు సంబరపడిపోతున్నారు.

Threat Call to Ram Mandir: రామ మందిరానికి మ‌రో ఉగ్ర‌వాద సంస్థ హెచ్చ‌రిక‌, అయోధ్య‌లో క‌ల్లోలం సృష్టిస్తామ‌ని హెచ్చ‌రించిన టెర్ర‌ర్ గ్రూప్ 

అయితే, కళ్లకు వస్త్రం లేకుండా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో బాలరాముడి విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహం ఫోటోలను ఆలయ ట్రస్ట్ కానీ, ప్రభుత్వం కానీ అధికారికంగా విడుదల చేయలేదు. అయినా కూడా సోషల్ మీడియాలో బాలరాముడి తొలి దర్శనం అంటూ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఫోటోలు ఆలయ గర్భగుడిలో తీసినవి కాదని, తయారు చేసే సమయంలో తీసిన ఫోటోలు అని చెబుతున్నారు. కళ్లకు గంతలు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విగ్రహం నిజమైనది కాదని శ్రీరామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు రాముడి కళ్లు తెరవకూడదన్నారు. ఒకవేళ కళ్లకున్న వస్త్రం ఎవరైనా తొలగించినట్లు అయితే అది ఎవరు చేశారో విచారణ జరపాలని ఆయన కోరారు.