Bank Holiday 2023: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్, నేటి నుంచి 5 రోజులు బ్యాంకులకు సెలవు, వరుస సెలవుల నేపథ్యమే కారణం
మహావీర్ జయంతి సందర్భంగా పలు ప్రైవేట్ బ్యాంకులతోపాటు ప్రభుత్వ బ్యాంకులకు పలు రాష్ట్రాల్లో సెలవు ఉంటుందని ఆర్బీఐ హాలీడే షెడ్యూల్ చెబుతున్నది
బ్యాంకులకు వెళ్లాలనుకున్న అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది.ఈ రోజు న మహా వీర్ జయంతి.. మహావీర్ జయంతి సందర్భంగా పలు ప్రైవేట్ బ్యాంకులతోపాటు ప్రభుత్వ బ్యాంకులకు పలు రాష్ట్రాల్లో సెలవు ఉంటుందని ఆర్బీఐ హాలీడే షెడ్యూల్ చెబుతున్నది.
మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛండీగఢ్, తమిళనాడు, రాజస్థాన్, లక్నో, న్యూఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఇప్పటికే ఈ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు అని ఆర్బీఐ ప్రకటించింది. మహావీర్ జయంతితోపాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, గుడ్ ఫ్రైడే వరకు సెలవులు ఉన్నాయి.
మంగళవారం (ఏప్రిల్ 4) మహావీర్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఇక ఏప్రిల్ ఐదో తేదీన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. ఇక ఈ నెల ఏడో తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా ఐజ్వాల్, బెలాపూర్, బెంగళూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, డెహ్రడూన్, గ్యాంగ్‌టక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంఫాల్, కాన్ఫూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలలో బ్యాంకులు పని చేయవు. ఈ నెల 8న రెండో శనివారం, తొమ్మిదో తేదీన ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.