Bank Holidays in November: నవంబర్‌ నెలలో బ్యాంకు సెలవులు ఇవే! ఈ రోజుల్లో బ్యాంకు పనులుంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి, ఒక్కో రాష్ట్రంలో వేర్వేరుగా బ్యాంకు హాలిడేస్, పూర్తి లిస్ట్ ఇదుగోండి

ప్రతి నెలా బ్యాంక్‌ సెలవులను ఆర్బీఐ (RBI) అప్‌డేట్‌ చేస్తూ ఉంటుంది. దీని ప్రకారం నవంబర్‌ 1,8,11,23 తేదీల్లో బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు (RBI holidays) ప్రకటించింది.

Employees Representational Image Photo Credit: PTI)

New Delhi, OCT 29: వచ్చే మంగళవారం నుంచి నవంబర్‌ (November) నెల రానుంది. వారాంతపు సెలవులతోపాటు (Weekend holidays) పలు పండుగల వల్ల బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలతో పోలిస్తే నవంబర్‌ నెలలో బ్యాంకు సెలవులు (Bank holidays) తక్కువగానే ఉంటాయి. నాలుగు ఆదివారాలు, రెండవ శనివారం, నాల్గవ శనివారంతో కలిపి సుమారు 10 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ప్రతి నెలా బ్యాంక్‌ సెలవులను ఆర్బీఐ (RBI) అప్‌డేట్‌ చేస్తూ ఉంటుంది. దీని ప్రకారం నవంబర్‌ 1,8,11,23 తేదీల్లో బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు (RBI holidays) ప్రకటించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వర్తిస్తున్న వారే. ఒక్కోసారి బ్యాంకుకెళ్లాల్సి రావచ్చు. కానీ, ఆయా బ్యాంకులకు సెలవు దినాలను చెక్‌ చేసుకుని సంబంధిత శాఖను సంప్రదించాలని సూచిస్తున్నారు. గురునానక్‌ జయంతి, వంగ్లా ఫెస్టివల్‌, కన్నడ రాజ్యోత్సవ్‌, కుట్‌ ఫెస్టివల్‌, సెంగ్‌ కుట్‌సనేం వంటి పండుగలకు సెలవులు ప్రకటించింది.

Uttar Pradesh Shocker: పెళ్లి భోజనంలో రసగుల్లా చిన్నగా ఉందంటూ ఫైటింగ్, ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, కేసు నమోదు చేసుకున్న యూపీ పోలీసులు 

ఆర్బీఐ. వీటిల్లో కొన్ని ప్రాంతాల వారీగా చేసుకునే పండుగలు. ఆ పండుగలు జరుపుకునే ప్రాంతాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయి. నవంబర్‌ 1న కన్నడ రాజ్యోత్సవ్‌ / కుట్‌.. కర్ణాటక, మణిపూర్‌ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. నవంబర్‌ ఒకటో తేదీన కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. అందుకే నవంబర్‌ 1వ తేదీని కన్నడ రాజ్యోత్సవ్‌గా పరిగణిస్తున్నారు. కుట్‌ ఫెస్టివల్‌ అంటే చవాంగ్‌ కుట్‌. బౌంటీఫుల్‌ హార్వెసట్‌ దీవెనల కోసం చవాంగ్‌ కుట్‌ ఉత్సవాలు నిర్వహిస్తారు. నవంబర్‌ 8న గురునానక్‌ జయంతి, కార్తీక పౌర్ణమి : త్రిపుర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, అసోం, సిక్కిం, మణిపూర్‌, కేరళ, గోవా, బీహార్‌, మేఘాలయ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

UP Nurse Grabs Woman Patient: మహిళా రోగిని జుట్టుపట్టుకొని లాక్కొచ్చి పడేసిన నర్సు, ఉత్తరప్రదేశ్‌ ఆస్పత్రిలో ఘటన, వైరల్‌గా మారిన వీడియో, నర్సు తీరుపై సర్వత్రా విమర్శలు 

నవంబర్‌ 11.. కనకదాస జయంతి/ వంగాలా ఫెస్టివల్‌ – కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. కనకదాస్‌ ఒక కవి, తత్వ వేత్త. నవంబర్‌ 23.. సెంగ్‌ కుట్స్‌నేమ్‌ లేదా సెంగ్‌ కుట్‌స్నేం – మేఘాలయలో బ్యాంకులు పని చేయవు. ప్రతియేటా ఖాసీ నూతన సంవత్సరం సందర్భంగా ఖాసీ సామాజిక వర్గం వారు నవంబర్‌ 23న ఖాసీ నూతన సంవత్సరాదిగా భావిస్తారు. దీన్నే సెంగ్‌ కుట్‌ స్నేమ్‌ అని పిలుస్తారు. 6,13,20, 27 తేదీల్లో ఆదివారం, 12న రెండో శనివారం, 26న నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.