Sitapur, OCT 28: ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో (UP Hospital) దారుణం జరిగింది. ఓ మహిళా రోగి పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. మహిళా రోగి జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోసింది. వివరాళ్లోకి వెళ్తే.. ఈ నెల 18న మహిళా రోగిని సీతాపూర్ జిల్లా ఆస్పత్రిలో (Sitapur district hospital) అడ్మిట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో మహిళ పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. ఆమె జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. మహిళా రోగి పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే సింగ్ ఈ చర్యను సమర్థించారు. అర్ధరాత్రి వేళ మహిళా రోగి వింతగా ప్రవర్తించిందని పేర్కొన్నారు. దీంతో ఆమెను నియంత్రించేందుకు నర్సులు అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆమెకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత సాధారణ స్థితికి వచ్చిందని చెప్పారు. అనంతరం మహిళను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.
Video: UP Nurse Grabs Woman Patient By Her Hair, Pins Her Down https://t.co/L7qmPBCqDG pic.twitter.com/Rp5gJU9t5J
— NDTV (@ndtv) October 28, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)