Bank holidays in November: నవంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు, ఈ లిస్ట్ చూసుకొని బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బంది తప్పదు

నవంబర్‌లోకి అడుగు పెట్టబోతున్నాం. పండుగ సీజన్‌ కావడంతో నవంబర్‌ నెలలో బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కస్టమర్‌లు తమ ఆర్థిక కార్యకలాపాలను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితాను (Bank holidays) ముందుగానే విడుదల చేసింది.

Bank | Representative Image (Photo Credits: PTI)

New Delhi, OCT 27: అక్టోబర్ నెల ముగుస్తోంది. నవంబర్‌లోకి అడుగు పెట్టబోతున్నాం. పండుగ సీజన్‌ కావడంతో నవంబర్‌ నెలలో బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కస్టమర్‌లు తమ ఆర్థిక కార్యకలాపాలను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితాను (Bank holidays) ముందుగానే విడుదల చేసింది. నవంబర్‌లో దీపావళి (Diwali), గోవర్ధన్ పూజ, ఛత్ పూజ, సాధారణ వారాంతాలతో సహా దేశంలోని పలు రాష్ట్రాలలో సెలవులతో కలుపుకొని మొత్తం 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) వంటి ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి.

CCTV Footage: షాకింగ్ వీడియో ఇదిగో, డ్యూటీలో ఉన్న పోలీసును ఢీకొట్టిన ఎస్‌యూవీ, బారికేడ్లతో సహా ఎగిరి అవతల పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ 

నవంబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..

నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం/కుట్/కర్వా చౌత్ (కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌)

నవంబర్ 5 - ఆదివారం

నవంబర్ 10 - వంగల పండుగ (మేఘాలయ)

నవంబర్ 11 - రెండవ శనివారం (వీక్లీ ఆఫ్)

నవంబర్ 12 - ఆదివారం (వీక్లీ ఆఫ్)

నవంబర్ 13 - గోవర్ధన్ పూజ/లక్ష్మీపూజ (త్రిపుర, ఉత్తరాఖండ్‌, సిక్కిం, మణిపూర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర)

నవంబర్ 14 - దీపావళి

నవంబర్ 15 - భాయ్ దూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/నింగల్ చక్కుబా/భ్రాత్రి ద్వితీయ (సిక్కిం, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌)

నవంబర్ 19, 2023 - ఆదివారం

నవంబర్ 20 - ఛత్ (బిహార్‌, రాజస్థాన్‌)

నవంబర్ 23 - సెంగ్ కుట్ స్నెమ్/ఇగాస్ బగ్వాల్ (ఉత్తరాఖండ్‌, సిక్కిం)

నవంబర్ 25 - నాల్గవ శనివారం

నవంబర్ 26 - ఆదివారం

నవంబర్ 27 - గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ (త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్ - తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌)

నవంబర్ 30 - కనకదాస జయంతి (కర్ణాటక)