ఢిల్లీలో డ్యూటీలో ఉన్న ఓ పోలీసును ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 24 రాత్రి ఢిల్లీలో ఓ పోలీసు కారును ఆపి పత్రాలు తనిఖీ చేస్తున్నాడు. అదే సమయంలో, అటుగా వచ్చిన ఓ ఎస్ యూవీ వాహనం నేరుగా పోలీసును గుద్దేసింది. ఈ తాకిడికి పోలీసు బారికేడ్లతో సహా ఎగిరి అవతలపడ్డాడు. గాయాలపాలైన ఆ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు. ఆ ఎస్ యూవీ డ్రైవర్ ను పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారు.ఈ ఘటన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఏరియాలో జరిగింది.

Delhi Police personnel hit by an SUV and thrown into the air in the Connaught Place area Watch CCTV footage

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)