Bank Strike On Jan 8: ఈ నెల 8న బ్యాంకులు, ఏటీఎంలు అన్నీ బంద్, ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ బంద్ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, 8వ తేదీ ఎవరూ విధులకు హాజరు కావద్దని ఉద్యోగులకు తేల్చి చెప్పిన బ్యాంకు యూనియన్లు

ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు కూడా అదే బాటలోకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం(Central GOVT) అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

All-India bank strike called on January 8 (Photo-PTI)

New Delhi,January 05: నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో ఒక ప్రభుత్వ శాఖ వారు వారి సమస్యలను పరిష్కరించాలని సమ్మెలు, బంద్ లు నిర్వహించారు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు కూడా అదే బాటలోకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం(Central GOVT) అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

నరేంద్ర మోడీ (PM Narendra Modi)ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌‌లు బంద్ (Bank Strike On Jan 8)చేపడుతున్నాయి. ఈ నెల 8న(బుధవారం) విధులకు రావొద్దని బ్యాంక్‌‌ యూనియన్లు (Bank employee unions)ఉద్యోగులకు సూచించాయి. కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్‌‌ ఇండియా జనరల్ స్ట్రయిక్‌‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి.

దీంతో సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకులపై పడనున్నాయి. బుధవారం రోజున బ్రాంచ్‌‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ప్రభావం ఏటీఎం(ATM) సేవలపై కూడా చూపనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అయితే ఆన్‌లైన్‌ ‌బ్యాంకింగ్ (Online Banking)సేవలు మాత్రం ఈ సమ్మెకు ప్రభావితం కావు.

స్ట్రయిక్ రోజు ఎలాంటి క్లరికల్ వర్క్‌‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించినట్టు ఆల్‌‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా చెప్పారు. ఎవరైనా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలన్నా, డబ్బు డ్రా చేసుకోవాలన్నా ఎవరైనా మంగళవారం రోజువరకే వారి పనులను పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ వర్గాలు తెలుపుతున్నాయి.