Bengal Shocker: మూడు వేలు ఇవ్వలేదని తండ్రిని దారుణంగా కొట్టి చంపిన ఆరు ముక్కలు చేసిన కొడుకు, హత్యలో కొడుకుకు సాయం చేసిన తల్లి, హత్య చేసి ఆరు ముక్కలు చేసి చెరువులో పడేసిన నిందితులు

పాలిటెక్నికల్ చదువుతున్న జాయ్ పరీక్షకు హాజరు కావడానికి రూ.3వేలు అడిగాడు. ఉజ్వల్ కొడుకు జాయ్‌కి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు చెప్పుతో కొట్టాడు. తీవ్రకోపోద్రిక్తుడైన కొడుకు తండ్రిని తోసేసి అతని తలపై బలంగా కొట్టాడు.

Representational Image. (photo credit- IANS)

West Bengal, NOV 20: ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్దా వాకర్ హత్యకేసును (Shradda Walker Murder) పోలిన తరహా ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రిటైర్డ్ ఇండియన్ నేవీ జవాన్ ను (Navi Jawan) కొడుకు హత్యచేశాడు. అనంతరం తల్లితో కలిసి శరీర భాగాలను ముక్కలుగాచేసి సమీపంలోని చెరువు, చెట్ల పొదల్లో పడేశాడు. రాష్ట్రం బరుయ్‌పూర్‌లోని (Baruipur) హరిహర్‌పూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చెరువులో ఛిద్రమైన మొండెం తేలడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టిపడేశారు. ఒంటిపై అనేక గాయాలు ఉన్నాయి. మృతుడిని ఉజ్వల్ చక్రవర్తి (Ujjwal Chakraborty) (55)గా గుర్తించారు. మృతుడు 12ఏళ్ల క్రితం నేవీ నుండి రిటైర్డ్ అయ్యాడు. పోలీసులు మృతుడు భార్య శ్యామాలి(48), కొడుకు జాయ్(25)ను (Joy Chakraborty) అదుపులోకి తీసుకొని విచారించారు.

Bhopal Murder Mystery: చెల్లెలిని వేధిస్తున్నాడని ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకుడు, 80 ముక్కలు చేసి అడవిలో పాతిపెట్టాడు, 9 నెలల పాటూ ఇన్వెస్టిగేషన్ చేసి కేసును ఛేదించిన మధ్యప్రదేశ్ పోలీసులు 

డబ్బుకోసం ఘర్షణ జరిగిన సమయంలో జాయ్ తన తండ్రిని హత్యచేసినట్లు విచారణలో అంగీకరించారు. పాలిటెక్నికల్ చదువుతున్న జాయ్ పరీక్షకు హాజరు కావడానికి రూ.3వేలు అడిగాడు. ఉజ్వల్ కొడుకు జాయ్‌కి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు చెప్పుతో కొట్టాడు. తీవ్రకోపోద్రిక్తుడైన కొడుకు తండ్రిని తోసేసి అతని తలపై బలంగా కొట్టాడు. అనంతరం గొంతుకోసి హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. నవంబర్ 13న ఈ ఘటన చోటుచేసుకుందని, తన భర్తను కొడుకు హత్యచేసే సమయంలో ఆపేందుకు ప్రయత్నించానని, అయితే, చాలా ఆలస్యం అయిందని, తన భర్త అప్పటికే చనిపోయాడని పోలీసుల విచారణలో మృతుడి భార్య శ్యామాలి తెలిపింది.

Uttar Pradesh: మత్తుకు బానిసై జైలులో ఆ పనికి పాల్పడిన ఖైదీలు, 140 మందికి హెచ్‌ఐవీగా నిర్ధారణ, మరో 35 మందికి టీబీ, ఉత్తరప్రదేశ్ దాస్నా జైలులో సంచలన విషయం వెలుగులోకి..  

అనంతరం.. తల్లి, కొడుకు మృతదేహాన్ని బాత్రూంలోకి లాగారు, జాయ్ రంపంతో తండ్రి శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. ఆ రాత్రి, జాయ్ వారి ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న పొదల్లో చేతులు, కాళ్లను పడేశాడు. మరుసటి రోజు బాత్రూంలో గోనె సంచిలో మొండెంను ఉంచి ఇంట్లోనే ఉంచారు. మరుసటిరోజు జాయ్ తన సైకిల్‌పై మొండెం తీసుకొని సమీపంలోని చెరువులో పడేశాడు. ఘటన జరిగిన రెండురోజుల తర్వాత ఉజ్వల్ కనిపించడం లేదని బరుయ్‌పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని ప్రశ్నించగా.. భయంతో ఉన్నట్లు గుర్తించారు. అనుమానంతో వీరిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉజ్వల్ నిత్యం మద్యం సేవించడంతోపాటు పొరుగువారితో గొడవల కారణంగా ఇబ్బందులకు గురై తల్లీ, కొడుకు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.