Massive Traffic Jam in Bengaluru: వరుసగా 5 రోజులు సెలవులు, బెంగళూరులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌, అర్థరాత్రి వరకు రోడ్ల మీదనే జాగారం

నగరంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు

Bengaluru Hit By Massive Traffic Jam (Photo-X)

వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బెంగళూరు మహానగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ (Massive Traffic Jam) అయ్యింది.బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు అర్ధరాత్రి వరకూ రోడ్లపైనే ఆగిపోవాల్సి వచ్చింది.

ముదురుతున్న కావేరీ జల వివాదం, తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని తేల్చి చెప్పిన కర్ణాటక ప్రభుత్వం

నగరంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలో ఈ ప్రభావం అధికంగా ఉంది. మరతహళ్లి, సర్జాపుర, సిల్క్‌బోర్డు రూట్లల్లో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఒక కిలోమీటర్ దూరం వెళ్లేందుకు ఏకంగా రెండు గంటల సమయం పట్టినట్లు నగరవాసులు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే వేచి ఉన్నారు. పాఠశాల విద్యార్థులు సైతం అర్థరాత్రి వరకు రోడ్లపైనే గడిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు.

 అక్టోబరు నెలలో 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు, చివరి వారంలోనే అత్యధిక సెలవులు, ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ఇదిగో..

ఈ వీకెండ్‌కు ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ రోజు ఈద్ మిలాద్ ఉన్ నబీకి అధికారికంగా సెలవు ఉంటుంది. కర్ణాటక-తమిళనాడు మధ్య చెలరేగుతున్న కావేరి నదీ జలాల వివాదంపై రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. టెక్ కంపెనీలకు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో నగరవాసులు తమ సొంతూళ్లకు బయలుదేరారు.

Here's Videos

బుధవారం సాయంత్రం ట్రాఫిక్‌ ఒక్కసారిగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాధారణ రోజుకు రెండింతలు ట్రాఫిక్ పెరిగిందని వెల్లడించారు. సాధారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. కానీ బుధవారం ఆ సంఖ్య ఏకంగా 3.5 వరకు పెరిగిందని స్పష్టం చేశారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడం కూడా మరొక కారణంగా చెప్పుకోవచ్చు.