Bengaluru Horror: బెంగుళూరులో దారుణం, తల్లిని చంపి శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన కూతురు
ఓ కూతురు కన్నతల్లినే చంపేసి (Murder) ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లింది.
Woman Brings Mother's Body to Police Station: కర్ణాటక (Karnataka)లో Bilekahalliలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ కూతురు కన్నతల్లినే చంపేసి (Murder) ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లింది. బెంగళూరులోని మికో లేఅవుట్ పరిధిలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల సెనాలి సేన్ గత కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది.
ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె తన భర్త, అత్త, తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. అయితే, సోమవారం తన తల్లితో గొడవపడిన సెనాలి ఆమెను చంపేసింది. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ ట్రాలీ సూట్‌కేస్‌లో కుక్కి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. సెనాలిని చూసి పోలీసులు కంగుతిన్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి విచారించారు.
ANI Video
తల్లి తనతో తరచూ గొడవ పడుతోందని అందుకే ఆమెను చంపేసినట్లు సెనాలి పోలీసుల ఎదుట అంగీకరించింది. ఆహారంలో నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసినట్లు తెలిపింది. ఈ ఘటన జరిగిన సమయంలో సెనాలి భర్త ఇంట్లో లేడు. అత్త ఇంట్లోనే ఉన్నా ఆమెకు ఈ విషయం గురించి తెలియదని నిందితురాలు తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.