Madhya Pradesh Shocker: బెయిల్‌ నుంచి వచ్చి మరీ బాధితురాలిపై అత్యాచారం, రేప్‌ కేసులో జైలుకు వెళ్లొచ్చిన రెండు రోజులకే అఘాయిత్యం, గొంతుపై కత్తిపెట్టి రేప్ చేసిన నిందితుడు, మధ్యప్రదేశ్‌లో కిరాతకుడు, కేసు వెనక్కు తీసుకోకపోతే చంపేస్తాంటూ బెదిరింపు

అప్పటికే యువతిని అత్యాచారం చేసినందుకు రెండేళ్లు జైల్లో ఉండివచ్చిన వ్యక్తి....మళ్లీ అదే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు తనపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డట్లు యువతి ఫిర్యాదు ఇవ్వడంలో ఘటన వెలుగులోకి వచ్చింది.

Representational image (Photo Credit: File Photo)

Bhopal, AUG 03: రేప్ కేసులో (Rape case)జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా ఆ నిందితుడికి బుద్దిరాలేదు. అప్పటికే యువతిని అత్యాచారం చేసినందుకు రెండేళ్లు జైల్లో ఉండివచ్చిన వ్యక్తి....మళ్లీ అదే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు తనపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డట్లు యువతి ఫిర్యాదు ఇవ్వడంలో ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ (Madhya pradesh) లోని జబల్‭పూర్ (jabalpur) జిల్లా‭లో జరిగిందీ దారుణం. మహిళపై అత్యాచారం చేయడంతో పాటు తనపై పెట్టిన రేప్ కేసును  (rape case) ఉపసంహరించుకోవాలంటూ బెదిరించాడు.  బాధితురాలు మరోసారి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ ఘటన నెల రోజుల క్రితమే జరిగిందని, నిందితుడితో పాటు అతడి స్నేహితుడు ఈ దారుణంలో పాలుపంచుకున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ప్రస్తుతం అత్యాచారానికి పాల్పడ్డ మహిళ(19)పైనే రెండేళ్ల క్రితం అదే నిందితుడు అత్యాచారం చేశాడు. అప్పుడు సదరు మహిళ మైనర్(17). నేర నిరూపన కావడంతో 2020లో జైలు పాలయ్యాడు. ఈమధ్యే బెయిల్‭పై బయటికి వచ్చాడు. అనంతరమే అదే మహిళపై తన స్నేహితుడి సాయంతో మరోసారి అత్యాచారం చేసి కేసు వెనక్కి తీసుకొమ్మని బెదిరించాడు.

Monkeypox outbreak: మంకీపాక్స్‌పై సూచనలు జారీ చేసిన కేంద్రం, చేయాల్సిన పనులు, చేయకూడని పనుల ఇవే 

నిందితుడి పేరు వివేక్ పటేల్ అని స్థానిక పోలీసు అధికారి ఆసిఫ్ ఇక్బాల్ వెల్లడించారు. నిందితుడు బాధితురాలి మెడపై కత్తి పెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్టు ఎఫ్ఐఆర్‭లో నమోదు అయినట్లు ఇక్బాల్ తెలిపారు. తాజాగా నిందితుడిపై గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా బాధితురాలిని నిందితుడు బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయింది.