Bihar 'Serial Kisser': మహిళల పెదవులపై బలవంతంగా ముద్దులు, బీహార్‌లో పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ కిస్సర్, వెతికే పనిలో పడిన పోలీసులు
రోడ్డుపై వెళుతున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ వారికి లిప్ టూ లిప్ కిస్ ఇస్తూ వెళుతున్నాడు. మహిళలు నడిచి వెళుతుండగా ఎక్కడ నుంచి వస్తున్నాడో తెలియకుంగా వెనకనుంచి గట్టిగా పట్టుకుని బలవంతంగా పెదలపై ముద్దు పెడతాడు.
బీహార్ ని కొత్తగా సీరియల్ కిస్సర్ వణికిస్తున్నాడు. రోడ్డుపై వెళుతున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ వారికి లిప్ టూ లిప్ కిస్ ఇస్తూ వెళుతున్నాడు. మహిళలు నడిచి వెళుతుండగా ఎక్కడ నుంచి వస్తున్నాడో తెలియకుంగా వెనకనుంచి గట్టిగా పట్టుకుని బలవంతంగా పెదలపై ముద్దు పెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరార్ అవుతాడు. జమై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి.. స్థానిక మహిళలకు వెనుక నుంచి వచ్చి బలవంతంగా ముద్దు పెట్టి వెళ్లిపోతున్నాడు. జమై సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ మహిళ మధ్యాహ్నం ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చింది.
ఆమె ఫోన్ లో మాట్లాడటంలో నిమగ్నమైంది. ఇంతలో ఓ వ్యక్తి సడెన్ గా ఆమె వెనుక నుంచి వచ్చి.. ఆమె చూసే లోపు గట్టిగా పట్టుకుని ఆ తర్వాత బలవంతంగా ముద్దు పెట్టాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ షాక్ కి గురైంది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Here's Video
దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంక్వైరీ చేసి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ దుండగుడిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలు జమై సర్ధార్ ఆస్పత్రిలో పని చేస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీరియల్ కిస్సర్ ను వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.