RGV Tweet on Rana Naidu: రానా నాయుడు ఇండియాలో దుమ్ము రేపిందిగా, నంబర్ వన్ షోగా ట్రెండింగ్‌లో వెబ్ సిరీస్, వర్మకు థ్యాంక్స్ చెబుతూ నెటిజన్లకు సారి చెప్పిన రానా

దగ్గుబాటి వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండ్ అవుతోంది. మార్చి 10న విడుదలైన ఈ సీరిస్ రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరింది

RGV Tweet on Rana Naidu: రానా నాయుడు ఇండియాలో దుమ్ము రేపిందిగా, నంబర్ వన్ షోగా ట్రెండింగ్‌లో వెబ్ సిరీస్, వర్మకు థ్యాంక్స్ చెబుతూ నెటిజన్లకు సారి చెప్పిన రానా
Rana Naidu (photo-Twitter)

దగ్గుబాటి వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండ్ అవుతోంది. మార్చి 10న విడుదలైన ఈ సీరిస్ రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరింది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తెలియజేసింది.

భారత్‌ టాప్‌ ట్రెండింగ్‌ షోల్లో ‘రానా నాయుడు’ ప్రథమ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ షేర్ చేసారు. వెంకటేష్,రానాలకు కంగ్రాట్స్ చెప్పారు. రామానాయుడుగారి కీర్తి పతాకాన్ని కొడుకు, మనవడు కలిసి ఎగరవేస్తున్నారని, అభినందనలు తెలియచేసారు.

ఇక ఈ సిరీస్‌లో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉందని పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు సమీర్ ఖాఖర్ కన్నుమూత, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా తిరిగిరాని లోకాలకు

ఈ క్రమంలో రానా (Rana) వాళ్లందరికీ సారీ చెప్పారు. అలాగే, ఈ సిరీస్‌ను కుటుంబంతో కాకుండా ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని మరోసారి స్పష్టం చేశారు.‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ ప్రీమియర్‌ రోజున వెంకటేష్‌ మాట్లాడుతూ తన కెరీర్‌లో ఇప్పటిదాకా చేయని ఓ భిన్నమైన ప్రయత్నమిదని, దీంట్లో హింస, శృంగార సన్నివేశాలు ఉంటాయని చెబుతూ…సారీ చెప్పాడు.

Here's RGV Tweet

అమెరికన్‌ టీవీ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రే డోనోవన్‌’ రీమేక్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. రానా సెలబ్రిటీ ఫిక్సర్‌గా, వెంకటేష్‌ నేరస్తుడి పాత్రల్లో నటించారు. మూడు దశాబ్దాలుగా క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ మీద కెరీర్ ని లాగిస్తున్న వెంకటేష్ ఈ వెబ్ సిరీస్ చేశారు. రానా నాయుడు'లో వెంకటేష్ పాత్ర తెలుగు ఆడియన్స్ కు షాకింగ్ గానే ఉంది.

(The above story first appeared on LatestLY on Mar 15, 2023 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).