 
                                                                 Hyd, Oct 3: మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కొండా మురళి - సురేఖ జీవిత చరిత్ర నేపథ్యంలో కొండా సినిమాను తెరకెక్కించారు వర్మ. అయితే తాజాగా సమంత పై సురేఖ చేసిన వ్యాఖ్యలను తనదైన శైలీలో ఖండించారు.
వరుస ట్వీట్లలో కొండా సురేఖను కడిపారేశారు. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని , ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు.. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది??? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ లోవుండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగా చైతన్య చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం నేర్పాలి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నామని వెల్లడించారు వర్మ.
4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం అన్నారు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు.
Here's Tweet:
కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని , ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం…
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
KTR ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ? అని పేర్కొన్నారు. తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? అని ప్రశ్నించారు.
నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు అని వరుస ట్వీట్‌లు చేశారు ఆర్జీవీ.
సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము https://t.co/YpSG8yzepd
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం
ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద… https://t.co/rMpA6UL798
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
