Rahul Gandhi serious on Konda Surekha, seeks report from Mahesh Goud(X)

Hyd, Oct 5: సినీ నటి సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు రాహుల్.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీకి లేఖ రాశారు కొండా సురేఖ. మంత్రి స్పందన చూశాక కొండా సురేఖపై చర్యలు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.

ఇటీవల గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సురేఖ....కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, అక్కినేని ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సమంత , నాగచైతన్య...కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని అలాగే పలువురు హీరోయిన్లను కేటీఆర్ ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు.   అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు, తమ్మడికుంట కబ్జా చేశారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు

Here's Tweet:

దీనిపై పెను దుమారం చెలరేగగా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి... సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. దీంతో సమంతకు క్షమాపణ చెప్పారు సురేఖ.

నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ (సమంత) మనోభావాలను దెబ్బతీయడం కాదు... స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా అని తెలిపింది. మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అంటూ తెలిపింది. అయినా ఈ వివాదం సద్దుమనగలేదు. సురేఖపై వంద కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు.