Bilkis Bano Case: ఐదు నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారం కేసు, జనవరి 21లోగా లొంగిపోవాలని దోషులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయం లేదని పేర్కొంది. దోషులు ఆదివారం నాటికి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది

Supreme Court. (Photo Credits: Wikimedia Commons

New Delhi, Jan 19: బిల్కిస్ బానో కేసులో లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయం లేదని పేర్కొంది. దోషులు ఆదివారం నాటికి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో (Bilkis Bano Case) తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే తాజా ఆదేశాలు వచ్చాయి.

గర్భవతిని రేప్ చేసిన ఆ 11 మందిని ఎందుకు విడుదల చేశారు, బిలిస్క్‌ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, పూర్తి వివరాలు ముందుంచాలని ఆదేశాలు

2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు.. బిల్కిస్‌ బానో(Bilkis Bano) కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో 11 మంది దోషులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. 2022లో వీరికి గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. ఆ ఏడాది ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు.

21 ఏళ్ల వయసులో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో

ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.