Memorial for Blackbuck: సల్మాన్ ఖాన్ చంపిన కృష్ణజింకకు స్మారకం, 800 కేజీల జింక విగ్రహం పెడుతున్న బిష్ణోయ్ వర్గం, గ్రామస్తులంతా చందాలు వేసుకొని నిర్మాణం, నిజం జింక అవశేషాలతో స్మారకం నిర్మాణం

బిష్ణోయ్‌ (Bishnoi Community) సొసైటీ తరఫున జోధ్‌పూర్‌ జిల్లాలోని కంకణి గ్రామంలో స్మారకాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో 800 కిలోల బరువునున్న కృష్ణ జింక విగ్రహాన్ని (blackbuck memorial) ఏర్పాటు చేయనున్నారు.

Jodhpur, AUG 14: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) 24 సంవత్సరాల కిందట చంపిన కృష్ణ జింక (blackbuck) కోసం రాజస్థాన్‌లో స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నారు. బిష్ణోయ్‌ (Bishnoi Community) సొసైటీ తరఫున జోధ్‌పూర్‌ జిల్లాలోని కంకణి గ్రామంలో స్మారకాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో 800 కిలోల బరువునున్న కృష్ణ జింక విగ్రహాన్ని (blackbuck memorial) ఏర్పాటు చేయనున్నారు. అడవిలో సహజంగా మరణించిన జింక అవశేషాలను జింక విగ్రహం తయారీకి సేకరించారు. బిష్ణోయ్‌ సమాజంలోని ప్రజలు కృష్ణ జింకలను సాంపద్రాయం, మతపరంగా వాటిని పవిత్రంగా భావిస్తారు. కంకణి (Kankani) గ్రామంలో దాదాపు ఏడు బిఘాల స్థలంలో నిర్మిస్తున్న స్మారక చిహ్నంలో అత్యాధునిక జంతు సంరక్షణ కేంద్రం సైతం నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కృష్ణజింకను చంపిన ప్రదేశంలోనే ఈ స్మారక నిర్మాణాన్ని చేపడుతున్నారు.

Rakesh Jhunjhunwala Dies: స్టాక్‌ దిగ్గజం రాకేష్ ఝన్‌ఝన్‌వాలా కన్నుమూత, రూ. 5వేలతో పెట్టుబడి ప్రారంభించి రూ. 35 వేల కోట్లకు చేరిన ఝన్‌ఝన్‌వాలా స్టాక్ ఇన్వెస్టిమెంట్లు, హైదరాబాద్‌లోనే పుట్టిన రాకేష్, స్టాక్‌ మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరు, ప్రధాని మోదీ సంతాపం  

గ్రామస్తులంతా డబ్బులు సేకరించి.. ఈ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కృష్ణ జింక విగ్రహాన్ని సైతం సిద్ధం చేశారు. దీన్ని జోధ్‌పూర్‌కు చెందిన కళాకారుడు శంకర్‌ 15 రోజుల్లోనే సిద్ధం చేశాడు.  ఈ సందర్భంగా బిష్ణోయ్‌ సంఘం నేత, మాజీ ఎంపీ జస్వంత్‌ సింగ్‌ బిష్ణోయ్‌ మాట్లాడుతూ తల తెగినా తమ వైఖరి మాత్రం జింకలేనని, గుర్తింపును కాపాడుకునేందుకు రక్షణ అవసరమన్నారు.

SBI Hike FD Interest Rate: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు, ఆర్బీఐ నిర్ణయంలో అమల్లోకి తెచ్చిన మూడు పెద్దబ్యాంకులు, ఎన్నిరోజులకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? 

ఇదిలా ఉండగా.. 1998 సెప్టెంబర్‌ 26 నుంచి 28 వరకు జోధ్‌పూర్‌లోని భవద్‌, మథనియా గ్రామాల్లో హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌ వచ్చాడు. ఆ సమయంలో రెండు కృష్ణ జింకలను వేటాడాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం జింకలను చంపిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈ కేసులో నటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రే సైతం నిందితులుగా ఉండగా..  సాక్ష్యాలు లేకపోవడంతో వారిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.