SBI Hike FD Interest Rate: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు, ఆర్బీఐ నిర్ణయంలో అమల్లోకి తెచ్చిన మూడు పెద్దబ్యాంకులు, ఎన్నిరోజులకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Representational Image | (Photo-ANI)

Mumbai, AUG 13: ఆర్బీఐ పెంచిన రెపోరేట్‌కు (Repo rate) అనుగుణంగా భార‌తీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఎంపిక చేసిన టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) పై వ‌డ్డీరేటు 15 బేసిక్ పాయింట్లు పెంచేసింది. శ‌నివారం నుంచి ఎఫ్డీల‌పై స‌వ‌రించిన వ‌డ్డీరేట్లు (Interest Rate) అమ‌ల్లోకి వ‌స్తాయి. రూ.2 కోట్ల లోపు ఎఫ్డీల‌కు పెంచిన వ‌డ్డీరేట్లు అమ‌ల‌వుతాయి. సాధార‌ణ ప్ర‌జానీకానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై (Fixed Deposits) వ‌డ్డీరేట్లు 2.90 నుంచి 5.65 శాతానికి, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 3.40 నుంచి 6.45 శాతానికి వ‌డ్డీ పెంచేసింది. ఇంత‌కుముందు జూన్ 14న ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్లు స‌వ‌రించింది. శ‌నివారం నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 180 రోజుల నుంచి 210 రోజుల్లోపు గ‌డువు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్లు 4.55 శాతానికి పెంచింది. ఏడాది నుంచి రెండేండ్ల లోపు గ‌డువు ఎఫ్డీల‌పై 5.30 నుంచి 5.45 శాతానికి వ‌డ్డీరేటు పెరిగింది. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.50 శాతం, మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు ఎఫ్డీల‌పై 5.60 శాతం, ఐదేండ్ల నుంచి ప‌దేండ్ల లోపు ఎఫ్డీల‌పై 6.65 శాతం వ‌డ్డీరేటు ఆఫ‌ర్ చేస్తున్న‌ది.

Nepal Bars Entry Of Indians: నేపాల్‌లో కరోనా కల్లోలం, భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం, ఇండియా నుంచి వెళ్లిన నలుగురికి కరోనా పాజిటివ్ 

సీనియ‌ర్ సిటిజ‌న్లు (Senior citizens) చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) పై 3.40 శాతం నుంచి 6.45 శాతం వ‌ర‌కు వ‌డ్డీరేట్లు పెంచివేసింది. ఏడు రోజుల గ‌డువు నుంచి ప‌దేండ్ల లోపు గ‌డువు వ‌ర‌కు గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు ఇది వ‌ర్తిస్తుంది. తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు, మెచ్యూర్డ్ డిపాజిట్ల రెన్యూవ‌ల్స్‌కు వ‌డ్డీరేట్ల పెంపు వ‌ర్తిస్తుందని ఎస్బీఐ వెల్ల‌డించింది. కోఆప‌రేటివ్ బ్యాంకుల్లో డొమెస్టిక్ ట‌ర్మ్ డిపాజిట్ల‌కు పెంచిన‌ వ‌డ్డీరేట్లు అమ‌ల‌వుతాయి.

Single Resident: పెద్ద భవనం అది. 127 ఫ్లాట్స్ ఉన్నాయి. అందర్నీ ఖాళీ చేయించారు. అయినా, ఒక్కడు మాత్రం అలాగే ఒంటరిగా ఉన్నాడు. ఏంటా సంగతి? 

మరోవైపు ఎస్‌బీఐ బాటలోనే యాక్సిస్ బ్యాంకు (Axis Bank) కూడా వడ్డీరేట్లను పెంచింది. 7 నుంచి 29 రోజుల వరకు ఫిక్స్‌ డ్ డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీరేటును అందిస్తామని తెలిపింది. అటు ఇదే బాటలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీరేట్లను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.