Delhi Municipal Election Results: తారుమారవుతున్న ఎగ్జిట్ పోల్స్, ఢిల్లీ పీఠంపై మరోసారి దూసుకుపోతున్న బీజేపీ, గణనీయమైన స్థానాల్లో ఆప్ ముందంజ, ఆసక్తికరంగా మారిన ఎంసీడీ ఎన్నికల ఫలితాలు
అయితే ఇప్పటికే మొదలైన ట్రెండ్స్ ప్రకారం ఎంసీడీ (MCD Results) ఎన్నికల్లో మొత్తం 250 స్థానాలకు గానూ బీజేపీ (BJP) 104స్థానాల్లో ముందజలో ఉంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా 100 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ముందంజలో ఉంది.
New Delhi, DEC 07: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (Delhi Municipal Election Results) వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో (Exit Polls) ఆమ్ ఆద్మీ పార్టీకి మెజార్టీ దక్కడంతో...అవి నిజమవుతాయా? లేదా? అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే మొదలైన ట్రెండ్స్ ప్రకారం ఎంసీడీ (MCD Results) ఎన్నికల్లో మొత్తం 250 స్థానాలకు గానూ బీజేపీ (BJP) 104స్థానాల్లో ముందజలో ఉంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా 100 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ముందంజలో ఉంది. 250 సీట్ల కోసం 1349 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని ఆధిక్యత ఉంది. అయితే ఆ ట్రెండ్ ఈ సారి మారుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ దానికి భిన్నంగా బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.
గత ఎన్నికల్లో నార్త్ ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ 64 వార్డుల్లో పట్టు బిగించగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 21 వార్డులు వచ్చాయి. 16 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అదే విధంగా దక్షిణ ఢిల్లీలో బీజేపీ 70, ఆమ్ ఆద్మీ 16, కాంగ్రెస్ 12 వార్డులు గెలుచుకున్నాయి. తూర్పు ఢిల్లీలోని 47 వార్డుల్లో బీజేపీ, 12 వార్డుల్లో ఆప్, 3 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందాయి.
2017 ఎన్నికల వరకు, పాత MCD మూడు భాగాలుగా విభజించబడింది. ఇందులో సదరన్ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్ మరియు నార్తర్న్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లో గత 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నది.