BJP President JP Nadda Twitter Account Hacked: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు, ఉక్రెయిన్ కు సహాయం చేయాలంటూ ఫేక్ ట్వీట్స్, రంగంలోకి దిగిన నిపుణులు

ఆదివారం ఉదయం ఆగంతకులు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు.

JP Nadda Press Meet (Photo-ANI)

న్యూ ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా (BJP President JP Nadda) ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. ఆదివారం ఉదయం ఆగంతకులు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అనంతరం ఆయన ఖాతా నుంచి రష్యా, ఉక్రెయిన్ లకు సాయం చేయాలంటూ వరుస ట్వీట్లు చేశారు. జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించిన ప్రభుత్వ వర్గాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి. ఆయన ఖాతా నుంచి వెలువడిన ట్వీట్లను తొలగించి, అకౌంట్ ను పునరుద్ధరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Indians in Ukraine: భారతీయులు జాగ్రత్తగా ఉండండి, ఎవ‌రూ ఏ దేశ స‌రిహ‌ద్దుల వైపు వెళ్లొద్ద‌ు, హెచ్చరించిన ఉక్రెయిన్‌ ఎంబ‌సీ అధికారులు, ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే విద్యార్థుల‌కు ముంబై ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు

"రష్యా ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను స్వీకరిస్తున్నారు. బిట్‌కాయిన్ – ఎథెరియం" అంటూ ఆగంతకులు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలా వరుసగా పలు ట్వీట్లు చేశారు. కాగా.. జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన విషయం తమ దృష్టికి వచ్చిందని, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దానిని పరిశీలిస్తోందని ఐటీ మంత్రిత్వశాఖ అధికారి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.