Tamil Nadu Horror: తమిళనాడులో దారుణం, శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు, వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నించడంతోనే హత్య..
నెల్లూరు, చైన్నై సెంట్రల్ మధ్య నడిచే సబర్మన్ ఎలక్ట్రికల్ ట్రైన్(Sabarman Electric train) మింజూర్ రైల్వే స్టేషన్(Minjur Railway Station) కు రాగానే ఓ సూట్‌కేసు ప్లాట్‌ఫాంపై పడింది.
Nellore, Nov 5: ఓ శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై తండ్రి కూతుర్లు విసిరేసిన దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. నెల్లూరు, చైన్నై సెంట్రల్ మధ్య నడిచే సబర్మన్ ఎలక్ట్రికల్ ట్రైన్(Sabarman Electric train) మింజూర్ రైల్వే స్టేషన్(Minjur Railway Station) కు రాగానే ఓ సూట్‌కేసు ప్లాట్‌ఫాంపై పడింది.
అయితే రైలు కదలడానికి ముందే సూట్‌కేసు కింద పడటం గమణించిన కానిస్టేబుల్(Constable) మహేష్ వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఆ సూట్‌కేసు నుంచి రక్తం కారడం చూసి దానిని తెరిచి చూడటంతో దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది(RPF)వారిని పట్టుకుని విచారించడంతో నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసుల ముందు తామే హత్య(Murder) చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను తండ్రీ కూతుర్లుగా పోలీసులు గుర్తించారు.
తమ కూతురును వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నిచడంతో ఆమెను హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. మృతురాలిని మన్యం రమణిగా గుర్తించిన పోలీసులు.. చెన్నైలో నిందితుల ఇంటి సమీపంలో నివాసం ఉంటుందని తెలుసుకున్నారు. మహిళ మెడలో 50 గ్రాముల బంగారం(50 Gram Gold) ఉందని, దానిని అపహరించి కడ్డీలుగా మార్చారని, అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని మింజూర్ రైల్వే స్టేషన్ లో పడేసేందుకు తరలించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు నెల్లూరుకు చెందిన సుబ్రమణ్యం, కూతురు దివ్యశ్రీ అని, వీరు చెన్నై(Chennai)లో నివాసం ఉంటున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు.