Bihar: బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు, ఆల్‌ఖైదా పేరుతో బెదిరింపులు, అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
పాట్నాలోని సీఎం కార్యాలయానికి బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Bihar, Aug 4: బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాట్నాలోని సీఎం కార్యాలయానికి బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా పేరుతో ఈ బెదిరింపు వచ్చింది. దీంతో ఆ రాష్ట్ర సచివాలయం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఏటీఎస్ పోలీసులు సైతం అలర్ట్ అయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్‌బీఐ ఏటీఎం తలుపులు పగలగొట్టి రూ. 23 లక్షలు దోచుకెళ్లిన దొంగలు, వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు
జూలైలో పట్నాలోని ఓ ఇంట్లో బాంబు తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 35 లైవ్ కాట్రిడ్జ్‌లు, పొటాషియం నైట్రేట్ బాక్స్, ట్రీ ఫిల్ లిక్విడ్ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పాట్నా విమానాశ్రయానికి సైతం బాంబు బెదిరింపు రాగా సోదాలు నిర్వహించిన అనంతరం బాంబు లాంటిదేమి లేదని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.