పాట్నా, ఫిబ్రవరి 1: బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఏటీఎం నుంచి రూ.23 లక్షల నగదు చోరీకి గురైన ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. ఫిబ్రవరి 1వ తేదీ గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఏటీఎంలో రూ.23 లక్షల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు.
హిందూస్థాన్ టైమ్స్‌లోని ఒక కథనం ప్రకారం , నిందితులు తెల్లవారుజామున 4.30 గంటలకు గోపాల్‌గంజ్‌లోని నౌరానియా ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ATMని తెరిచి దొంగతనానికి పాల్పడ్డారు. నిందితులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను తెరిచారని మిర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) కిషోరి చౌదరి తెలిపారు.
వారు రూ.23 లక్షల నగదు తీసుకుని పరార్ అయ్యారు. ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని ఎస్‌హెచ్‌ఓ చౌదరి తెలిపారు. AMT నగదు లూటీ వెనుక ఎంత మంది ఉన్నారనేది కూడా తమకు తెలియదని అధికారి తెలిపారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఏటీఎం చోరీ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
"మేము మాన్యువల్ ఇన్‌పుట్‌ల ద్వారా దర్యాప్తు ప్రారంభించాము, వీడియో ఫుటేజీని కూడా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాము" అని SHO చౌదరి తెలిపారు. కాగా, ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు. ఈ బృందానికి హత్వా సబ్ డివిజనల్ పోలీసు అధికారి నేతృత్వం వహిస్తారు