HC on Abortion: అత్యాచార బాధితురాలి గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించిన బాంబే హైకోర్టు, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జన్మనివ్వవచ్చని తీర్పు

బలవంతంగా ప్రసవం చేసినా బిడ్డ సజీవంగా పుడుతుందని వైద్యులు అభిప్రాయపడటంతో 15 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 28 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది.

Bombay High Court (Photo Credit: PTI)

బలవంతంగా ప్రసవం చేసినా బిడ్డ సజీవంగా పుడుతుందని వైద్యులు అభిప్రాయపడటంతో 15 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 28 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది. బలవంతంగా డెలివరీ చేసినా కూడా బిడ్డ పుడుతుందనుకుంటే, ఆ బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిండు గర్భిణి  జన్మనివ్వవచ్చని జూన్ 20న జస్టిస్ ఆర్వీ ఘుగే, వైజీ ఖోబ్రగాడేలతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి కోరుతూ అత్యాచార బాధితురాలి తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.

మైనర్ బాలిక దత్తత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఆమెను తండ్రికి అప్పగించాలంటూ ఒడిషా హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన అత్యున్నత ధర్మాసనం

ఈ ఏడాది ఫిబ్రవరిలో తన కూతురు కనిపించకుండా పోయిందని, మూడు నెలల తర్వాత రాజస్థాన్‌లో ఓ వ్యక్తితో కలిసి పోలీసులకు దొరికిపోయిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్న మహిళ. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద వ్యక్తిపై కేసు నమోదు చేశారు.బాలికను నాసిక్‌లోని గర్భిణీ స్త్రీలను సంరక్షించే షెల్టర్ హోమ్‌లో లేదా ఔరంగాబాద్‌లోని మహిళల కోసం ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో ఉంచవచ్చని కోర్టు పేర్కొంది. శిశువుకు జన్మనిచ్చిన తర్వాత, శిశువును ఉంచాలా లేదా దత్తత కోసం ఇవ్వాలా అనే దానిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అమ్మాయికి ఉంటుందని హైకోర్టు తెలిపింది.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Delhi High Court: పరస్పర సమ్మతితో చేసే శృంగారం రేప్‌ కాదు.. వేధింపుల కోసం చట్టాన్ని వాడుకోవద్దు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif