మైనర్ బాలిక సంరక్షణ బాధ్యతను ఆమె తండ్రికి పునరుద్ధరించాలని ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. తన మైనర్ కుమార్తె సంరక్షణను పునరుద్ధరించాలని కోరుతూ ఓ ముస్లిం తండ్రి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రతివాదులైన అతని సోదరి తాము బిడ్డను దత్తత తీసుకున్నామని తెలిపారు. అతని భార్యకు కవల కుమార్తెలు ఉన్నారని, ఇద్దరు పిల్లలను పెంచడానికి తమకు వనరులు లేనందున, ఒక బిడ్డను మాకు దత్తత ఇచ్చారని వాదించారు. ముస్లిం సంప్రదాయం 'కఫాలా' ప్రకారం పిల్లవాడిని పిటిషనర్ సోదరికి అప్పగించారు.
భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకూ సమాన వాటా ఇవ్వాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన మద్రాసు హైకోర్టు
దీనిపై ఆ తండ్రి ఒడిషా హైకోర్టును ఆశ్రయించగా జువైనల్ జస్టిస్ యాక్ట్ మరియు ముస్లిం పర్సనల్ లా ప్రకారం చట్టపరమైన దత్తతకు రుజువు లేదని పేర్కొంటూ వ్యతిరేక పక్షాల వాదనలను అంగీకరించడానికి హైకోర్టు నిరాకరించింది. బాలిక కస్టడీ బాధ్యతను ఆమె అత్త నుంచి తండ్రికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలతో కలత చెందిన అత్త, బాలిక తన దగ్గరే పెరిగిందని, ఆమెను మార్చడం వల్ల మానసిక క్షోభకు గురిచేస్తుందని వాదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.కేసును పిల్లల ఉత్తమ ప్రయోజనాల కోణంలో చూడాలని నోటీసు జారీ చేస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశం ఆ చిన్నారిని తన సుపరిచిత వాతావరణం నుంచి తరలించేలా చేస్తుందని బెంచ్ పేర్కొంది.