Madras High court

HC on Husband Property Share to Wife: భర్త తను సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిలో భార్యకూ సమాన వాటా ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓ గృహిణిగా ఆమె కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలనే ఇంటి బెంగ లేకుండా భర్త స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా సంతృప్తికరంగా బయట పనిచేయడానికి వీలవుతోందని, తద్వారా ఆస్తులు సంపాదన జరుగుతోందని పేర్కొంది. కాబట్టి భర్త తన పేరున సంపాదించిన ఆస్తులన్నింటిలోనూ భార్య సమాన హక్కుదారు అని తెలిపింది.

కుటుంబ ఆస్తులు భర్త సంపాదించడం వెనుక భార్య పరోక్ష భాగస్వామ్యం ఉంది. ఆమె గృహ విధులను సక్రమంగా నిర్వర్తించడం వలనే భర్త ఎలాంటి ఒత్తిడి లేకుండా బయట సంపాదన చేయడానికి వీలవుతోంది. ఈ విషయాన్ని ఈ న్యాయస్థానం గుర్తిస్తోందని పేర్కొంది. మరణించిన తన భర్త పేరిట ఉన్న ఆస్తుల్లో సమాన వాటా ఇవ్వాలని కోరుతూ అమ్మాల్‌ అనే గృహిణి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

Live Law Tweet