IAF Mig-21 Crashes: కుప్పకూలిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం, ఇద్దరు పైలెట్లు మృతి, రాజస్థాన్‌లో ఘటన, మంటల్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు, వైరల్‌గా మారిన వీడియో

చుట్టుపక్కల దట్టమైన పొగలు భారీగా వ్యాపించాయి. ఈ ఘటనలో ఫైటర్ జెట్ (MiG-21 trainer aircraft) కాలిబూడిదైంది. ఫైటర్ జెట్ ప్రమాదంతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి (Indian Air force) చెందిన మిగ్-21 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ బర్మర్ జిల్లాలోని బిమ్రా (bimra) గ్రామంలో కుప్పకూలింది.

Barmer, July 29: రాజస్టాన్‌లో బర్మర్ జిల్లాలో (Barmer)ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిగ్ 21 ఫైటర్ జెట్(MiG-21 trainer aircraft) కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. ఫైటర్ జెట్ కూలడంతో మంటలు భారీగా చెలరేగాయి. చుట్టుపక్కల దట్టమైన పొగలు భారీగా వ్యాపించాయి. ఈ ఘటనలో ఫైటర్ జెట్ (MiG-21 trainer aircraft) కాలిబూడిదైంది. ఫైటర్ జెట్ ప్రమాదంతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి (Indian Air force) చెందిన మిగ్-21 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ బర్మర్ జిల్లాలోని బిమ్రా (bimra) గ్రామంలో కుప్పకూలింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఫైటర్ జెట్ లో ఉన్న ఇద్దరు పైలెట్లు (both pilots died)మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ధారించింది. రాత్రి వేళ శిక్షణ ఇస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

”ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఇద్దరు పైలెట్లు ప్రమాదంలో మరణించారు. మృతుల కుటుంబాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్ర సంతాపం తెలుపుతోంది. ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాము” అని ఐఏఎఫ్ (IAF) తెలిపింది.

MP Ragging Horror: అమ్మాయిని ఎంచుకుని దిండ్లతో సెక్స్ చేయండి, ఇండోర్ మెడికల్ కాలేజీలో జూనియర్లపై సీనియర్ల ర్యాగంగ్, ఘ‌ట‌న‌ను సిరీయ‌స్‌గా తీసుకున్న యూజీసీ, విచారణకు ఆదేశం  

ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే డిఫెన్స్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను రాజ్ నాథ్ కు తెలియజేశారు ఐఏఎఫ్ చీఫ్ చౌదరి. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు రాజ్ నాథ్ సింగ్. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పైలెట్ల మృతదేహాలు సైతం మంటల్లో కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు కొందరు ఇదంతా వీడియో తీశారు.