Bhopal, July 29: మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ విద్యార్థులు.. తమ సీనియర్లు ర్యాగింగ్‌కు (Ragging Horror) పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ MBBS విద్యార్థులు.. కొంతమంది సీనియర్లు తమను దిండులతో శృంగారం చేయమని బలవంతం చేశారని తెలిపారు. జూనియర్ అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, దుర్భషలాడారని తెలిపారు. క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థుల ఫ్లాట్లలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల బెదిరింపులకు గురికావడంతో జూనియర్ విద్యార్థులు యూజీసీ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. సీనియర్లు తమను దిండులపై సెక్స్ (Unnatural Sex) చేయమని బలవంతం చేశారని, ఆపై ఏదైనా మహిళా బ్యాచ్ మేట్ పేరును ఎంచుకోవాలని, ఆమె గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సెక్స్ చేయాలని సీనియర్లు చెప్పినట్లుగా (Ragging Horror In Indore Medical College) బాధితులు ఆరోపిస్తున్నారు.
అంతే కాకుండా ఒకరికొకరు కొట్టుకోవాలని బలవంతం చేసినట్లు జూనియర్ విద్యార్థులు పేర్కొన్నారు. తమ మొబైల్ ఫోన్లను లాక్కొని.. గుంజిలు తీయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ మొబైల్ ఫోన్లు లాక్కొని బలవంతంగా స్విచ్చాప్ చేశారని బాధితులు ఆరోపించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న సీనియర్ విద్యార్థులపై తక్షణమే చర్యలు తీసుకుంటూ, UGC ఫిర్యాదును కళాశాల యాజమాన్యానికి పంపింది. మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ సెల్ ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణలు నిజమేనని తేల్చింది. అనంతరం తగు చర్యల నిమిత్తం పోలీసులకు అప్పగించారు.
IPC మరియు ర్యాగింగ్ నిరోధక చట్టం 2009లోని వివిధ సెక్షన్ల కింద కొంతమంది సీనియర్ విద్యార్థులపై FIR దాఖలు చేయబడింది, క్రిమినల్ బెదిరింపులు, అశ్లీల చట్టం మరియు యాంటీ ర్యాగింగ్ చట్టం 2009లోని సంబంధిత సెక్షన్ల కింద భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద జూలై 24న FIR దాఖలు చేయబడింది. ఇప్పుడు, పోలీసులు మొత్తం బ్యాచ్ ఫ్రెషర్స్ యొక్క స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తారు మరియు ఆ తర్వాత నిందితులైన సీనియర్‌లను గుర్తిస్తామని ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన సంయోగితగంజ్ పోలీస్ స్టేషన్‌లోని అధికారులు తెలిపారు.