Air Compressor Pipe Into Rectum: మీ సరదా తగలెయ్యా? ఆడుకుంటూ పురీషనాళంలో ఎయిర్ కంప్రెసర్ పెట్టిన బాలుడు, అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు, గుజరాత్‌లో ఘటన, సరదాకోసం చేశానంటున్న నిందితుడు
బాలుడి పురీష నాళంలో అతడి స్నేహితుడు ఎయిర్ కంప్రెషర్ (Air Compressor) చొప్పించటంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. అనంతరం ప్రాణాలు విడిచిన దారుణ ఘటన గుజరాత్ లోని (Gujrat) మెహ్సానాలో (mehasna) జరిగింది.
Surat, July 16: ఇద్దరు చిన్న పిల్లలు సరదాకి చేసిన పని… ఒక బాలుడి ప్రాణాలు (Boy dies) తీసింది. బాలుడి పురీష నాళంలో అతడి స్నేహితుడు ఎయిర్ కంప్రెషర్ (Air Compressor) చొప్పించటంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. అనంతరం ప్రాణాలు విడిచిన దారుణ ఘటన గుజరాత్ లోని (Gujrat) మెహ్సానాలో (mehasna) జరిగింది. మెహ్సానా జిల్లాలోని కడి తాలుకాలో ఛత్రల్-కడి హైవేలోని అలోక్ ఇండ్రస్ట్రీస్ లో ఉడ్ వర్క్ (Wood work)విభాగంలో పని చేస్తున్న ఓ బాలుడు గురువారం తోటి కార్మికుడి(16)ని ఆట పట్టించాలనుకున్నాడు. చెక్కలను తొలగించేందుకు ఉపయోగించే ఎయిర్ సక్షన్ పంప్ ను బాలుడి పురీషనాళంలోకి (Pipe Into Rectum) చొప్పించాడు. దీంతో ఆ బాలుడు అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు.
ఈవిషయాన్ని నిందితుడు యజమానికి చెప్పగా.. అతడు వెళ్లి చూసే సరికి బాలుడు అపస్మారక స్ధితిలో పడి ఉన్నాడు. వెంటనే వారు బాలూడిని ఆస్పత్రికి తరలించగా బాలుడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. సరదాగా ఆట పట్టించటానికే ఈపని చేశానని… చంపాలనుకోలేదని నిందితుడైన బాలుడు చెప్పాడు. కాగా… బాలుడి మృతికి కారణమైన మరో బాలుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలుడు ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
గురువారం మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో కార్మికులందరూ వెళ్లే టప్పుడు ఒంటిపై పడిన కలప పొట్టును తొలగించుకునేందుకు ఎయిర్ కంప్రెషర్ ఉపయోగిస్తూ ఉంటారు. బాలురిద్దరూ మధ్యాహ్నం భోజన సమయంలో ఒంటిమీద ఉన్న కలప పొట్టును తొలగించుకునే క్రమంలో ఆటలాడుకుంటూ ఈ చర్యకు పాల్పడ్డారని వారి యజమాని చెప్పాడు.