Wrong Surgery: కాలు ఆపరేషన్ కోసం వచ్చి 9 ఏళ్ల బాలుడి పురుషాంగం కోసిన డాక్టర్లు, థానేలో నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిన వైద్యుల తీరు
జరిగిన పొరపాటు తెలుసుకున్న డాక్టర్లు గాయమైన కాలుకు కూడా శాస్త్రచికిత్స చేశారు. ఇది తెలిసి బాలుడి పేరెంట్స్ షాక్ అయ్యారు.
Mumbai, June 29: గాయపడిన బాలుడి కాలుకు సర్జరీ బదులు డాక్టర్లు సున్తీ చేశారు. (Wrong Surgery) ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పొరపాటు జరిగింది. ఇది తెలిసి షాకైన బాలుడి తల్లిదండ్రులు వైద్యాధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ల తప్పు, నిర్లక్ష్యంపై దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని థానే (Thane) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షాహాపూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కాలుకు గాయమైంది. దీంతో బాలుడి తల్లిదండ్రులు జూన్ 15న షాహాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలుడి కాలుకు సర్జరీ బదులు సున్తీ చేశారు. జరిగిన పొరపాటు తెలుసుకున్న డాక్టర్లు గాయమైన కాలుకు కూడా శాస్త్రచికిత్స చేశారు. ఇది తెలిసి బాలుడి పేరెంట్స్ షాక్ అయ్యారు. వైద్యాధికారులతోపాటు షాహాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే రోజు అదే వయస్సున్న ఇద్దరు బాలురకు సర్జరీ చేయాల్సి ఉండటంతో తమ కుమారుడికి పొరపాటున సున్తీ చేసి ఉంటారని ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ప్రయత్నించారు. బాలుడి ప్రైవేట్ భాగంలో కూడా సమస్య ఉందని వైద్యాధికారి గజేంద్ర పవార్ తెలిపారు. దీంతో ఆ బాలుడికి రెండు ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందన్నారు. అయితే డాక్టర్లు ఒక సర్జరీ గురించి మాత్రమే బాలుడి పేరెంట్స్‌కు చెప్పి ఉంటారని, రెండో ఆపరేషన్ గురించి చెప్పడం మరిచి ఉంటారని అన్నారు.