BSNL Revival: రూ.లక్షా 64 వేల కోట్లతో బీఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం, భారీ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం, బీఎస్‌ఎన్‌ఎల్‌లో భారత్ బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్ విలీనానికి ఆమోదం
బీఎస్‌ఎన్‌ఎల్‌లో భారత్ బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్(బీబీఎన్‌ఎల్) విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది
New Delhi, July 27: భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) పునరుజ్జీవం దిశగా కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో భారత్ బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్(బీబీఎన్‌ఎల్) విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ సేవల పటిష్టం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ. లక్షా 64 వేల కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్దరణ (BSNL Revival) ప్యాకేజీకి కేబినెట్ అనుమతి తెలిపింది.
ఈ సందర్భంగా టెలికంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ అప్పులను వాటాలుగా మారుస్తామని తెలిపారు. సేవలను మెరుగుపరచడం, బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడం, ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ వంటి మూడు అంశాలు ప్యాకేజీలో (Cabinet Approves Rs 1.64 Lakh Crore ) ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. 1,20,000 సైట్లలో 4జీ సేవలు అవసరమని తెలిపిన కేంద్ర మంత్రి.. ప్రతి నెలా కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ సర్వీసుల్లో నాణ్యతను పెంచడం, బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్‌ను మరింత చేరువ చేయడం, నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ను ( Bharat Sanchar Nigam Limited) కొంత ఉపశమనం కల్పించడం. అంతేకాకుండా.. 4జీ సేవలను విస్తరించుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ రంగంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎ్‌సఎన్‌ఎల్) సిద్ధమవుతోంది. ఇందుకోసం తనకు 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్, 3,300-3,670 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 70 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.
ట్రాయ్ నిర్ణయించిన కనీస ధర ప్రకారం చూస్తే ఈ స్పెక్ట్రమ్ విలువ రూ.61,000 కోట్లు. ఇందులో 3,300-3670 బ్యాండ్ స్పెక్ట్రమ్ అత్యాధునిక 4జీ, 5జీ సేవలకు ఉపయోగపడుతుంది. ఇక 700 మెగాహెట్జ్ ప్రీమియం బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారా తక్కువ టవర్లతో విశాలమైన ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించవచ్చు.