5G Representational Image (Photo Credits: Twitter)

5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి(5G Spectrum India Auction) ప్రారంభం అయింది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్‌ చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేలం జరగనున్నట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. బిడ్డర్ల వ్యూహాలు, రేడియో తరంగాలకు గల డిమాండ్‌ బట్టి వేలం ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ఆధారపడి ఉంటుందని వివరించాయి. 4జీతో పోలిస్తే పది రెట్లు వేగవంతంగా ఉండే 5జీ సర్వీసులకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలంలో రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాతో పాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా పోటీపడుతోంది.

ముఖేశ్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ జియో, సునిల్ మిట్ట‌ల్‌కు చెందిన భార‌తి ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా, గౌత‌మ్ అదానీకి చెందిన అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ కంపెనీలు 5జీ స్పెక్ట్ర‌మ్ కొనుగోలు రేసులో ఉన్నాయి. 4జీ క‌న్నా ప‌ది రేట్ల వేగంతో 5జీ స్పెక్ట్ర‌మ్ ద్వారా డేటా ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), 3300 MHz, 26 GHz, ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల‌లో వేలం జ‌ర‌గ‌నున్న‌ది.

టెల్కో ప్రత్యర్థులకు షాక్, టెలికం రంగంలోకి అదాని గ్రూపు, 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 100 కోట్లు డిపాజిట్‌

స్పెక్ట్ర‌మ్ సిగ్న‌ల్ పూర్తిగా అమ్ముడుపోయే వ‌ర‌కు వేలం నిర్వ‌హించ‌నున్నారు. కొన్ని రోజుల పాటు వేలం జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం ద్వారా సుమారు 70 నుంచి ల‌క్ష కోట్ల వ‌ర‌కు అమ్ముడుపోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు టెలికాం శాఖ తెలిపింది. వేలం కోసం జియో కంపెనీ ముందుగానే 14 వేల కోట్లు డిపాజిట్ చేసింది.